09aaf9e8-ec32-4a66-b4f1-9a23e4adbd91-Bhuma-Mounika.jpg

కవల పిల్లలు..  మంచు మనోజ్ ఏం చెప్పారంటే?

అభిమానులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం..

అనుక్షణం మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఇటువంటి ఒక గొప్ప కుటుంబం మాకు అండగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం.

నా సతీమణి ప్రస్తుతం ఏడవ నెల గర్భవతి. భగవంతుని ఆశీస్సులతో ఈ క్షణం వరకు తను ఆరోగ్యంగా సురక్షితంగా ఉంది.

ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డల పట్ల ఎంతో ఆశగా ఆసక్తితో ఎదురుచూస్తున్నాం.

ఒక విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను.

కవల పిల్లలు విషయంలో బయట వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదు. 

ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మేము నేరుగా మా ఆనందాన్ని మీతో పంచుకుంటాము.

దయచేసి మా ప్రమేయం లేకుండా బయట వస్తున్న వార్తలను పట్టించుకోవద్దు.