తేజసజ్జ చైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 50 సినిమాలలో అందరి అగ్ర నటులతో నటించాడు.

చిరంజీవితో 'చూడాలనివుంది'లో మొట్ట మొదటసారిగా వెండితెర మీద కనపడిన తేజ, తనకి స్ఫూర్తి చిరంజీవే అని చెపుతూ ఉంటాడు

'యువరాజు' సినిమాలో మహేష్ బాబు కుమారుడిగా నటించిన తేజ సజ్జ, ఈ సంక్రాంతికి అదే మహేష్ బాబు సినిమాతో పోటీపడ్డారు

'ఓ బేబీ!' లో రావు రమేష్ కుమారుడిగా వేసిన తేజకి బాలనటుడి నుండి పెద్దగా ఎదిగిన తరువాత వచ్చిన మొదటి విజయం. అందులో సమంత కథానాయకురాలు

'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందు సినిమా 'జాంబీ రెడ్డి' లో కథానాయకుడిగా తేజ సజ్జ ఘనవిజయం సాధించాడు 

రామ్ చరణ్ తేజ గారికి రాజమౌళి గారు, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు, ఇప్పుడు ఈ తేజకి ప్రశాంత్ వర్మ దొరికాడు అని చెప్పాడు తేజసజ్జ

కథానాయకుడిగా 'అద్భుతం', 'ఇష్క్' అనే రెండు సినిమాలు చేసాడు తేజ, కానీ అవి ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు 

ఈ 'హనుమాన్' సినిమాతో ఇప్పుడు ప్రపంచం అంతా తానే అయిపోయాడు. పెద్ద సినిమాలని సైతం పక్కన పెట్టి ఈ చిన్న సినిమాని చూస్తున్నారు, వంద కోట్ల క్లబ్ లోకి అప్పుడే వచ్చేసాడు 

'హనుమాన్' సినిమాకి నేను ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే, దీనికి సృష్టికర్త, మూలం ప్రశాంత్ వర్మ అని చెప్పిన తేజ అగ్ర నటులతో పోటీపడి గొప్ప విజయం సాధించాడు