అల్ రౌండర్ అనసూయ

అనసూయ కాలేజీలో చదువుతుండగానే 'నాగ' సినిమాలో ఒక చిన్న పాత్ర చేసింది. సునీల్ వెనకాల వున్న ఆ ఫోటో వైరల్ అవుతూ ఉంటుంది. 

ఎంబిఎ పూర్తి చేసాక ఒక బ్యాంకులో టెలిఫోన్ కాలర్ గా చేసింది, తరువాత ఇంకో కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా చేసింది

ఒక టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా జాయిన్ అయింది, తరువాత అలా యాంకరింగ్ చెయ్యడం మొదలెట్టింది 

మొదటి సినిమా నాగార్జున పక్కన 'సోగ్గాడే చిన్ని నాయనా' లో ఒక పాటలో చేసింది. ప్రధాన పాత్రగా 'క్షణం' ఆమె మొదటి సినిమా

కాలేజీలో ఉండగానే శశాంక్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. వారికి ఇద్దరు మగ పిల్లలు. 

సాంఘీక మాధ్యమంలో చురుకుగా ఉంటూ, సమాజంలో జరిగే సంఘటనల మీద తన అభిప్రాయం నిక్కచ్చిగా చెపుతూ ఉంటుంది

ఇటు సినిమాలు, అటు టీవిలో, అలాగే సాంఘీక మాధ్యమంలో కూడా బిజీ ఉంటూ ఎప్పుడూ వార్తల్లో వుండే వ్యక్తి అనసూయ