Alia, Katrina, Priyanka : అక్కతో అనుకున్నారు, తమ్ముడితో పిక్స్ అయ్యారు!

ABN , First Publish Date - 2021-12-29T02:04:03+05:30 IST

కొన్నాళ్ల క్రితం ఫర్హాన్ అఖ్తర్ ఓ మల్టీ స్టారర్ మూవీ అనౌన్స్ చేశాడు. అయితే, అందులో అందర్నీ ఆకట్టుకున్నది ప్రియాంక, ఆలియా, కత్రీనా కాంబినేషన్. ఆ స్థాయి బిగ్ బాలీవుడ్ బ్యూటీస్ ఒకేసారి, ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవటం సాధారణ విషయం కాదు.

Alia, Katrina, Priyanka : అక్కతో అనుకున్నారు, తమ్ముడితో పిక్స్ అయ్యారు!

మొదట ప్రియాంక కాల్ చేసింది. ఆమె చెప్పిన ఐడియా నచ్చటంతో బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్‌కు... ఆలియా, కత్రీనా ఫోన్ చేశారు. ‘‘మేం ముగ్గురం కలసి నీతో సినిమా చేయాలనుకుంటున్నాం’’ అన్నారట. ఈ విషయం స్వయంగా జోయానే బయటపెట్టింది. అయితే, ప్రియాంక, ఆలియా, కత్రీనా తాము కోరుకున్నట్టుగా త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారు. త్రీ రోజెస్ లాంటి పీసీ, ఆలియా, క్యాట్ ఒకేసారి బిగ్ స్క్రీన్‌పై ఆడియన్స్‌ని అలరించనున్నారు. కానీ, అది జోయా అఖ్తర్ సినిమా కాదు... ఆమె తమ్ముడు ఫర్హాన్ అఖ్తర్ రూపొందించే ఆల్ గాళ్స్ రోడ్ ట్రిప్ మూవీ!


కొన్నాళ్ల క్రితం ఫర్హాన్ అఖ్తర్ ఓ మల్టీ స్టారర్ మూవీ అనౌన్స్ చేశాడు. అయితే, అందులో అందర్నీ ఆకట్టుకున్నది ప్రియాంక, ఆలియా, కత్రీనా కాంబినేషన్. ఆ స్థాయి బిగ్ బాలీవుడ్ బ్యూటీస్ ఒకేసారి, ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవటం సాధారణ విషయం కాదు. అందుకే, ‘జీ లే జరా’ పేరుతో తెరకెక్కనున్న ఆ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ ముగ్గురు ముద్దుగుమ్మల పేర్లే బయటకొచ్చాయిగానీ హీరోలు ఎవరు అన్నది చెప్పలేదు. అయితే, ప్రియాంక, ఆలియా, కత్రీనా చేసే ఓ ప్రయాణమే సినిమా కథ అంటున్నారు. వారి రోడ్ ట్రిప్‌లో ఏం జరిగింది అన్నదే ఫర్హాన్ చూపించబోతున్నాడట. 


బాలీవుడ్ సీనియర్ రైటర్ జావేద్ అఖ్తర్ కూతురైన జోయా అఖ్తర్ గతంలో ఫర్హాన్, హృతిక్, అభయ్ డియోల్ కాంబినేషన్‌లో ‘జిందగీ నా మిలేగీ దుబారా’ సినిమా చేసింది. ఆమె ముగ్గురు హీరోలతో జర్నీ మూవీ చేయగా ఇప్పుడు ఫర్హాన్ ముగ్గురమ్మాయిలతో అలాంటి కాన్సెప్ట్‌నే సినిమాగా మార్చనున్నాడు. అయితే, తన తమ్ముడు ఫర్హాన్ దర్శకత్వంలో ఆలియా, ప్రియాంక, కత్రీనా కలసి నటించటం వెనుక ఉన్న ఉదంతాన్ని జోయా తాజాగా వెల్లడించింది. ప్రియాంక సలహాపై జోయాకి ఆలియా, కత్రీనా ఫోన్ చేశారట. ఆమె దర్శకత్వంలో ముగ్గురు బ్యూటీస్ మల్టీ స్టారర్ చేయాలని భావించారు. కానీ, వారికి అప్పటికి తెలియని విషయం ఏంటంటే... జోయా తమ్ముడు ఫర్హాన్ ఆల్ గాళ్స్ మూవీ ఒకటి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని. అందుకే, మన ఏంజిల్స్ ముగ్గుర్నీ ఫర్హాన్ సినిమాలో నటించమని జోయా సజెస్ట్ చేసిందట. అలా ఆలియా, ప్రియాంక, కత్రీనా... అక్క సినిమా కోసం బయలుదేరి... తమ్ముడి మూవీకి ఫిక్స్ అయిపోయారు! 

Updated Date - 2021-12-29T02:04:03+05:30 IST