Suhana Khan, Khushi Kapoor, Agastya Nanda : ఇద్దరమ్మాయిలతో... అమితాబ్ మనవడు!

ABN , First Publish Date - 2022-04-18T21:52:40+05:30 IST

స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ కోసం ఫిల్మ్ మేకర్ జోయా అఖ్తర్ తన లైవ్ యాక్షన్ మ్యూజికల్ ఫిల్మ్ ‘ది ఆర్చీస్’ను ప్రారంభించింది. సోమవారం తొలి షాట్ చీత్రకరణ జరుపుకున్న క్రేజీ నెట్ ఫ్లిక్స్ మూవీ చాలా రోజులుగా బాలీవుడ్ లో బిగ్ అట్రాక్షన్ గా మారింది. అందుక్కారణం...

Suhana Khan, Khushi Kapoor, Agastya Nanda : ఇద్దరమ్మాయిలతో... అమితాబ్ మనవడు!

స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ కోసం ఫిల్మ్ మేకర్ జోయా అఖ్తర్ తన లైవ్ యాక్షన్ మ్యూజికల్ ఫిల్మ్ ‘ది ఆర్చీస్’ను ప్రారంభించింది. సోమవారం తొలి షాట్ చీత్రకరణ జరుపుకున్న క్రేజీ నెట్ ఫ్లిక్స్ మూవీ చాలా రోజులుగా బాలీవుడ్ లో బిగ్ అట్రాక్షన్ గా మారింది. అందుక్కారణం, ‘ఆర్చీస్’లో మూడు ప్రధాన పాత్రల్ని హైప్రొఫైల్ స్టార్ కిడ్స్ ప్లే చేస్తుండటమే. బిగ్ బి మనవడు, బాద్ షా కూతురు, బోనీ కపూర్ వారసురాలు ఒకేసారి బీ-టౌన్ ఎంట్రీ ఇస్తున్నారు!


‘ది ఆర్చీస్’ అమెరికన్ కామిక్ సిరీస్. దాని ఆధారంగా బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్ రూపొందిస్తోన్న ఇండియన్ వర్షన్ కి కూడా ‘ది ఆర్చీస్‘ అనే టైటిల్ ఖరారు చేశారు. రీమా కాగ్టీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా షారుఖ్ ఖాన్, బోనీ కపూర్ కూతుళ్లు సుహానా, ఖుషీ ఫీమేల్ లీడ్స్ నటిస్తున్నారు. వారిద్దరికీ బాలీవుడ్ లో ఇదే తొలి ప్రాజెక్ట్ కాగా... అమితాబ్ కూతురు శ్వేత తనయుడు అగస్త్య నంద కూడా ‘ది ఆర్చీస్’తోనే జనం ముందుకు రానున్నాడు. ముగ్గురు వారసులు ఒకే సినిమాతో సినీ రంగంలో కాలుమోపుతుండటంతో అభిమానుల్లో అప్పుడే బాగా క్రేజ్ ఏర్పడింది. ‘‘ఆర్చీస్ షూట్ స్టార్ట్స్...’’ అంటూ ప్రొడ్యూసర్ రీమా ఇన్ స్టాగ్రామ్ లో అధికారికంగా ప్రకటించారు. చూడాలి మరి, బీ-టౌన్ సరికొత్త వారసులకి తొలి ప్రయత్నంలో అదృష్టం ఎంత వరకూ కలసి వస్తుందో... 

Updated Date - 2022-04-18T21:52:40+05:30 IST