నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ వదిలిన కింగ్ నాగార్జున

ABN , First Publish Date - 2021-11-08T22:52:30+05:30 IST

సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా.. సీనియర్ నరేష్, తులసి, ‘గెటప్’ శీను ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. మహేష్ ఉప్పాల దర్శకత్వంలో మెగా డాటర్ నిహారిక ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. తాజాగా

నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ వదిలిన కింగ్ నాగార్జున

సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా.. సీనియర్ నరేష్, తులసి, ‘గెటప్’ శీను ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. మహేష్ ఉప్పాల దర్శకత్వంలో మెగా డాటర్ నిహారిక ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కింగ్ నాగ్ మాట్లాడుతూ.. మనందరిదీ ఒక పెద్ద ఫ్యామిలీ. సినిమా ఫ్యామిలీ. కానీ, ఈ మహేష్‌ది చిన్న ఫ్యామిలీ అంట. మరి, ఈ చిన్న ఫ్యామిలీ స్టోరీ ఏంటో చూద్దాం రండి. మామూలుగా లేదుగా ట్విస్ట్. మరి, ఈ బరువు బాధ్యత మహేష్ తీసుకుంటాడంటారా? చూద్దాం... నవంబర్ 19న ‘జీ 5’లో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని ఎక్స్‌క్లూజివ్‌గా. నిహారిక, మహేష్ ఉప్పాల, టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ట్రైలర్ చూశాక ఈ ఫ్యామిలీ స్టోరీని చూసేందుకు నేను కూడా వెయిటింగ్.. అని అన్నారు.


మెగా డాటర్ నిహారిక మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ విడుదల చేసిన నాగార్జునగారికి చాలా చాలా థాంక్స్. మేం అడిగిన వెంటనే ఒప్పుకొన్నారు. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్. కామెడీ డ్రామా అని చెప్పవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ నవ్వుకునేలా ఉంటుంది. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, నరేష్ గారు, తులసిగారు పాత్రల్లో జీవించారు. సిరీస్‌లో ఐదు ఎపిసోడ్స్ ఉన్నాయి. నవంబర్ 19న విడుదల చేస్తున్నాం. ‘జీ 5’లో మా సిరీస్ విడుదల కానుండడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని తెలపగా.. ‘‘నాగబాబుగారి పుట్టినరోజు సందర్భంగా వెబ్ సిరీస్ టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశాం. తర్వాత నానిగారు టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు నాగార్జునగారు ట్రైలర్ విడుదల చేశారు. మా సిరీస్ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసిన స్టార్ హీరోలకు థాంక్స్. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్... ప్రతిదానికి ప్రేక్షకుల స్పందన బాగుంది. సిరీస్ కూడా ఆకట్టుకుంటుంది. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సిరీస్ పిల్లలతో పాటు పెద్దల్ని కూడా ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు మహేష్ ఉప్పాల తెలిపారు. చక్కటి వినోదం, ప్రేమకథతో కూడిన వెబ్ సిరీస్ ఇదనీ... హీరో హీరోయిన్ల పాత్రలతో పాటు నరేష్, తులసి, బామ్మ పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయని ‘జీ 5’ ప్రతినిధులు తెలిపారు. క్యారెక్టర్ పోస్టర్లకు అద్భుత స్పందన లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.  



Updated Date - 2021-11-08T22:52:30+05:30 IST