తాతగారి నుండి నేర్చుకుంది.. ఫ్యాన్స్‌కి నేను ఇవ్వగలిగింది అదే: ఎన్టీఆర్

ABN , First Publish Date - 2022-04-01T03:18:32+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ విజయానందంలో ఉన్నారు. ఆయన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి వస్తున్న స్పందనతో చిత్రయూనిట్ అంతా సంతోషంగా ఉంది. మంచి టాక్‌తో విజయవంతంగా

తాతగారి నుండి నేర్చుకుంది.. ఫ్యాన్స్‌కి నేను ఇవ్వగలిగింది అదే: ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ విజయానందంలో ఉన్నారు. ఆయన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి వస్తున్న స్పందనతో చిత్రయూనిట్ అంతా సంతోషంగా ఉంది. మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. విడుదలకు ముందు ఈ చిత్రాన్ని రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ త్రయం ఎలా ప్రమోట్ చేసిందో తెలియంది కాదు. విడుదల తర్వాత కూడా బాలీవుడ్‌లో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలకు హీరోలు అటెండ్ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ ఛానల్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్.. తన తాతగారైన నందమూరి తారక రామారావు దగ్గర నుండి ఏం నేర్చుకుందీ.. నందమూరి అభిమానులకు తను ఇవ్వగలిగింది ఏమిటనేది సుస్పష్టంగా తెలియజేశారు. 


‘‘తాతగారి నుండి ఎంతో స్పూర్తి పొందాను. ఆయన గొప్పనటుడు, రాజకీయ నాయకుడే కాకుండా ఈ దేశంలోని గొప్ప పౌరుడు. ఎన్నో పాత్రలు పోషించారు. ఈ దేశ పౌరుడిగా ఎంత బాధ్యతతో ఉండాలో అందరికీ నేర్పారు. ఆయన నుండి నేను నేర్చుకున్నది ఏమిటంటే.. ఎంతో పొందాం.. సమాజానికి మనం ఏదైనా చేయాలి. ఈ దేశ పౌరుడిగా మనం పొందిన ప్రేమను ఇతరులకు కూడా పంచాలి.. అనేది తాతగారి నుండి నేర్చుకున్నా. నా అభిమానులకు దీనిని ఎలా అందివ్వాలి? అనేది ఎప్పుడూ ఆలోచిస్తుంటా. నేను బాధగా ఉంటే వారు ఏడుస్తారు.. నేను సంతోషంగా ఉంటే వారు హాయిగా నవ్వుతూ ఉంటారు. నిజంగా ఇది అద్భుతమని అనిపిస్తుంది. వాళ్లని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలనేది తాతగారి నుండి తెలుసుకున్నా. వాళ్లని ఎలా సంతోషంగా ఉంచగలను అంటే.. మంచి మంచి కథలతో సినిమాలు చేయడం ద్వారానే అది సాధ్యమని తెలుసుకున్నా. ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. తాతగారితో కలిసి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించాను. అదే నా మొదటి చిత్రం..’’ అని చెప్పుకొచ్చారు. 



Updated Date - 2022-04-01T03:18:32+05:30 IST