పూర్ వర్క్.. ఈ విషయంలో యంగ్ టైగర్ మారాల్సిందే!

ABN , First Publish Date - 2022-07-17T02:39:26+05:30 IST

RRR సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్‌కి తన యాక్టింగ్ కేపబిలిటీస్ ఏంటో చూపించిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR). నటనకి నిలువెత్తు రూపం తారక రామారావు

పూర్ వర్క్.. ఈ విషయంలో యంగ్ టైగర్ మారాల్సిందే!

RRR సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్‌కి తన యాక్టింగ్ కేపబిలిటీస్ ఏంటో చూపించిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR). నటనకి నిలువెత్తు రూపం తారక రామారావు (Taraka RamaRao) అనే రేంజులో కాంప్లిమెంట్స్ అందుకున్న ఎన్టీఆర్, బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేశాడు. అనౌన్స్ అయితే చేశాడు కానీ నెలలు గడుస్తున్నా ఒక్క సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇండియా వైడ్ ఉన్న క్రేజ్‌ని సరైన టైమ్‌లో క్యాష్ చేసుకోవాలి అంటే.. ‘ఆర్ ఆర్ ఆర్’ వేడి తగ్గక ముందే ఎన్టీఆర్ నుంచి సినిమా రావాలి. కానీ ఎన్టీఆర్ ఇంకా సెట్స్ పైకే వెళ్ళలేదు. 


మరో వైపు మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) మాత్రం శంకర్ (Shankar) సినిమా RC15ని దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసే స్టేజ్‌కి వచ్చేశాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే చరణ్-శంకర్‌ల సినిమా వచ్చే ఏడాది మొదటి రెండు మూడు నెలలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ టైమ్‌కి ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ సినిమా షూటింగ్‌లోనే ఉంటాడు. చరణ్ ఏమో జెట్ స్పీడ్ చూపిస్తున్నాడు, తారక్ ఏమో డేడ్ స్లోగా ఉన్నాడు అనేది నిజం. చరణ్ చూపిస్తున్న స్పీడ్ ఎన్టీఆర్ నుంచి లేకపోవడంతో కొంతమంది... ఎన్టీఆర్ డేట్స్ ఎవరు చూస్తున్నారు, ఇదేంటి ఒక స్టార్ హీరోకి ఇంత పూర్ ప్లానింగా అంటున్నారు. నిజానికి ఎన్టీఆర్ సినిమా డిలే అవ్వడానికి కారణం కొరటాల శివ, ఆచార్య కష్టాల్లో ఉండడమే అని తారక్ ఫాన్స్ అంటున్నారు కానీ... ఎన్టీఆర్ కూడా ఇంకా తన లుక్ అండ్ బాడీ షేప్‌ని ఎన్టీఆర్ 30 కోసం రెడీ చేయలేదు. తారక్ ఎప్పుడు రెడీ అవుతాడు, కొరటాల శివ (Koratala Siva) ఈ ‘ఆచార్య’ (Acharya) కష్టాల నుంచి ఎప్పుడు బయటకి వస్తాడో తెలియదు కానీ... తారక్ ఫాన్స్‌కి మాత్రం మరో మూడు నెలల వరకూ ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. 


బాహుబలి (Bahubali) తర్వాత ప్రభాస్ (Prabhas) కూడా ఇలానే... దాదాపు రెండున్నర ఏళ్ల టైం తీసుకోని, అతి జాగ్రత్తలు పాటించి ‘సాహో’ (Saaho) లాంటి సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అది అనుకున్నంతగా ఆడలేదు, దీంతో ఫ్యాన్స్ ఘోరంగా డిజప్పాయింట్ అయ్యారు. ఈ పరిస్థితి తారక్‌కి, తారక్ ఫాన్స్‌కి రాకుంటే చాలు.

Updated Date - 2022-07-17T02:39:26+05:30 IST