Prabhas: బిజినెస్‌లోకి దిగుతోన్న బాహుబలి

ABN , First Publish Date - 2022-07-14T02:50:02+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు బిజినెస్‌లో ఎంటరవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సినిమా షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్న ప్రభాస్.. ఇప్పుడు బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడనే

Prabhas: బిజినెస్‌లోకి దిగుతోన్న బాహుబలి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు బిజినెస్‌లోకి ఎంటరవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సినిమా షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్న ప్రభాస్.. ఇప్పుడు బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడనే విషయం బయటికి రాగానే.. ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఆయన పేరు వినిపిస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలో ఇండియాలోనే హీరోలందరి కంటే టాప్ పొజీషన్‌లో ఉన్నాడు ప్రభాస్. అందరికంటే ఎక్కువ వసూలు చేస్తున్నాడు. ఫెయిల్యూర్స్ పలకరిస్తున్నా సరే.. ఈమధ్యే రెమ్యూనరేషన్ మరింతగా పెంచేశాడట ప్రభాస్. ఒక సినిమాకు 100 కోట్ల నుంచి 120 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఐదు సినిమాలకే  దాదాపుగా 6 వందల కోట్లు  రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంటే ఒక్క సినిమాకు ఎంత లేదన్న 120 కోట్లు తీసుకుంటున్నట్టే. ప్రస్తుతం ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్  తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్  ఫస్ట్ వరుసలోకి వచ్చేశాడు. దీన్ని బట్టి అర్ధం అవుతోంది ప్రభాస్ క్రేజ్ ఏంటనేది.


ప్రభాస్ అడిగిన రెమ్యూనరేషన్‌ను ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్‌కి కూడా అంతగా ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే ప్రభాస్‌కున్న మార్కెట్ అలాంటిది. సినిమా హిట్ టాక్ వచ్చిందంటే చాలు వెయ్యి కోట్లకు పైనే వసూలు వస్తాయని నమ్ముతున్నారు. ఇలా వచ్చిన డబ్బుతోనే ప్రభాస్ కొత్తగా  బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వైరల్ అవుతోంది. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలు బిజినెస్ రంగంలో ఉండగా.. ప్రభాస్ కూడా ఆ లిస్ట్‌లో చేరబోతున్నారు. త్వరలోనే హోటల్ మార్కెట్‌లోకి యంగ్ రెబల్ స్టార్ గ్రాండ్  ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. 


అయితే ఈ బిజినెస్ ఒక్క ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇండియాతో పాటుగా స్పెయిన్, దుబాయ్ వంటి దేశాల్లో ఈ బిజినెస్‌ను స్ప్రెడ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తీరికలేకుండా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్.. అంత బిజీలో కూడా  ఈ బిజినెస్ ప్లానింగ్‌ను వర్కౌట్ చేసే పనిలో మునిగి తేలుతున్నారట. అయితే ఈ విషయం అఫీషియల్‌గా బయటికి రావాల్సి ఉంది. మరి ఇంత బిజీలో కూడా ఈ బాహుబలి తన బిజినెస్ ప్లాన్ ను ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.

Updated Date - 2022-07-14T02:50:02+05:30 IST