వరుస అవకాశాలతో.. బిజీ హీరోగా ‘Crrush’ కృష్ణ

ABN , First Publish Date - 2022-07-10T02:49:07+05:30 IST

నటుడు, దర్శకుడు రవిబాబు దర్శకుడిగా తెరకెక్కించే చిత్రాలతో కొత్త టాలెంట్‌ని వెలికి తీస్తుంటాడనే విషయం తెలిసిందే. తన చిత్రాలతో అల్లరి నరేష్, విజయ్ దేవరకొండ వంటి వారిని రవిబాబు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే ఇటీవల ఆయన రూపొందించిన

వరుస అవకాశాలతో.. బిజీ హీరోగా ‘Crrush’ కృష్ణ

నటుడు, దర్శకుడు రవిబాబు దర్శకుడిగా తెరకెక్కించే చిత్రాలతో కొత్త టాలెంట్‌ని వెలికి తీస్తుంటాడనే విషయం తెలిసిందే. తన చిత్రాలతో అల్లరి నరేష్, విజయ్ దేవరకొండ వంటి వారిని రవిబాబు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే ఇటీవల ఆయన రూపొందించిన ‘క్రష్’ (Crrush) చిత్రంతో మరో యంగ్ హీరో కృష్ణ బూరుగుల (Krishna Burugula)ని  తెలుగు  ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయగా.. ఆ చిత్రంతో అతను నటుడిగా మంచి గుర్తింపునే పొందారు. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఇప్పుడతడిని వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ‘మా నాన్న నక్సలైట్’ చిత్రంలో కూడా కృష్ణ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఆ చిత్రానికి సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్ర క్లైమాక్స్‌లో కృష్ణ నటనను విమర్శకులు సైతం ప్రశంసిస్తుండటం గమనార్హం.


కృష్ణ బూరుగుల విషయానికి వస్తే.. నటనలో శిక్షణ పొంది షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ, అప్రంటీస్‌గా  అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ  సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. వందల ఆడిషన్లలో పాల్గొన్న ఆయన.. సొంతంగా ఒక 100 ఆడీషన్ వీడియోలు తీసి.. ఇండస్ట్రీ వ్యక్తులకి పంపించి సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఇప్పుడు నటుడిగా బిజీగా మారాడు. ప్రస్తుతం కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ హీరోగా రూపొందుతోన్న ‘కృష్ణమ్మ’ చిత్రంలో సెకండ్ హీరోగా, దిల్ రాజు బ్యానర్‌లో హరీష్ శంకర్ సమర్పణలో వస్తోన్న ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్‌లోనూ అలాగే ‘అర్జున్ రెడ్డి’ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ బ్యానర్‌లో రూపొందుతోన్న ఓ చిత్రంలో ‘Crrush’ కృష్ణ  నటిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2022-07-10T02:49:07+05:30 IST