కమల్ హాసన్ ‘విక్రమ్’లో అతిథి పాత్రలో యంగ్ హీరోయిన్..?

ABN , First Publish Date - 2022-05-01T23:48:05+05:30 IST

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక సినిమాలతో అభిమానులను అలరించే నటుడు కమల్ హాసన్.

కమల్ హాసన్ ‘విక్రమ్’లో అతిథి పాత్రలో యంగ్ హీరోయిన్..?

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక సినిమాలతో అభిమానులను అలరిస్తున్న నటుడు కమల్ హాసన్. తాజాగా అతడు నటించిన చిత్రం ‘విక్రమ్’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ‘విక్రమ్’ జూన్ 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే..


‘విక్రమ్’ సినిమాలో ఓ ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉందంట. ఆ ఎపిసోడ్‌లో యంగ్ హీరోయిన్ అతిథి పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్ర శాన్వీ శ్రీవాస్తవకు దక్కిందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. సినిమాలో ఆ పాత్ర నిడివి దాదాపుగా 10నిమిషాలు ఉంటుందని సమాచారం. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కూడా ప్లాష్ బ్యాక్ ఎపిపోడ్‌లోనే కనిపించనున్నాడని కోలీవుడ్ పత్రికలు తెలుపుతున్నాయి. ‘విక్రమ్’ చిత్రంలో కమల్ హాసన్‌కు కూడా ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్‌లో కమల్ యంగ్ లుక్‌లో కనిపించడానికీ వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. యంగ్ కమల్ పక్కన శాన్వీ నటించనుందా లేదా ఇతర నటుల పక్కన కనిపించనుందా అనేది తెలియాలంటే మాత్రం చిత్రబృందం తెలిపే వరకు వేచి చూడాల్సిందే. శాన్వీ శ్రీవాస్తవ ‘లవ్లీ’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ పక్కన నటించింది. అనంతరం ‘అడ్డా’, ‘రౌడీ’, ‘ప్యార్ మే పడిపోయానే’ వంటి చిత్రాల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. కన్నడ నుంచి శాన్వీకి అవకాశాలు విపరీతంగా వస్తుండటంతో అక్కడే స్థిరపడిపోయింది.



Updated Date - 2022-05-01T23:48:05+05:30 IST