రచ్చ మామూలుగా లేదుగా.. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

ABN , First Publish Date - 2022-04-18T20:01:00+05:30 IST

ఎటువంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ..

రచ్చ మామూలుగా లేదుగా.. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఎటువంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టారో హీరో యశ్ నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్లని కొల్లగొట్టింది. దీంతో ఆ సినిమా సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూశారు. కరోనా గడ్డు పరిస్థితుల కారణంగా పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఏప్రిల్ 14న విడుదలైంది.


విడుదలకి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ రికార్డులకు తెర తీసింది. ఆ ఉత్సాహాన్ని అలాగే కొనసాగిస్తూ విడుదల తర్వాత కూడా రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. రిలీజ్ మొదటి రోజు దాదాపు అన్ని భాషల్లో 165 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళనాడులో తప్ప మిగిలిన అన్ని రాష్ర్టాల్లో నెంబర్ వన్‌గా నిలిచింది. అనంతరం కూడా ప్రతి రోజు 100 కోట్లకి పైగా గ్రాస్‌ని సాధించి కేవలం నాలుగు రోజుల్లోనే 500 కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టింది. 


ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సినీ విశ్లేషకుడు మనోబాలా విజయబాలన్ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌లో.. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500కోట్ల మైలురాయిని దాటేసింది’ రాసుకొచ్చాడు. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ రోజువారీ గ్రాస్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి..


మొదటిరోజు - రూ.165.37 కోట్లు

రెండోరోజు - రూ.139.25 కోట్లు

మూడోరోజు - రూ.115.08 కోట్లు

నాలుగోరోజు - రూ.132.13 కోట్లు

మొత్తం - రూ. 551.83 కోట్లు

Updated Date - 2022-04-18T20:01:00+05:30 IST