Yashoda Teaser: అంతా రివర్స్.. సమంత లైఫ్‌కి చాలా దగ్గరగా ఉందిగా!

ABN , First Publish Date - 2022-09-10T03:08:39+05:30 IST

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన సమంత (Samantha).. ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అవుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకులు, ఆ తర్వాత జరిగిన..

Yashoda Teaser: అంతా రివర్స్.. సమంత లైఫ్‌కి చాలా దగ్గరగా ఉందిగా!

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన సమంత (Samantha).. ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అవుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకులు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ.. ఆమెను నిత్యం వార్తలలో ఉంచేలా చేస్తున్నాయి. వీటికి తగ్గట్లుగా ఆమె పోస్ట్ చేసే ఫొటోలు, రిలీజ్ చేసే వీడియోలు కూడా.. హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇలా వార్తలలో ఉండటమే కానీ.. ఆమె రెండు సినిమాలు పూర్తి చేసినా.. ఏ ఒక్క సినిమా అప్‌డేట్ కూడా ఈ మధ్య కాలంలో రాలేదు. తాజాగా ఆమె నటించిన ‘యశోద’ (Yashoda) చిత్ర టీజర్‌ని మేకర్స్ వదిలారు.  శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హరి - హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన చిత్ర టీజర్.. ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఈ టీజర్‌లో సమంత ప్రెగ్నెంట్ అని చెప్పి.. డాక్టర్ జాగ్రత్తలు చెబుతుండగా.. ఆ జాగ్రత్తలకి రివర్స్‌లో సమంత లైఫ్‌లో జరుగుతుంటుంది. అయితే టీజర్ రిలీజ్ తర్వాత.. ఇది ఆమె రియల్ లైఫ్‌కి కూడా చాలా దగ్గరగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ ప్రత్యక్షమవుతుండటం విశేషం. (Yashoda Teaser)


అదెలా అంటే.. సమంత ఊహించుకున్న జీవితం ప్రస్తుతం ఉంటున్నదైతే కాదు. ఆ మధ్య ఓ ఇంటర్యూలో (విడాకులకు ముందు) తనకు పిల్లలంటే చాలా ఇష్టమని తెలిపింది. ఆ కోరిక తీరలేదు. భర్తతో హాయిగా తన జీవితం సాగాలని కోరుకుంటున్నట్లుగా మరో ఇంటర్వ్యూలో తెలిపింది. కానీ ప్రస్తుతం ఆమె విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. ఇలా ఆమె ఊహించుకున్నదంతా రివర్సే అయింది. టాప్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తున్న సమంత లైఫ్ ఈ విధంగా మారడానికి కారణాలు ఏంటనేది ఇప్పటి వరకైతే తెలియలేదు కానీ.. ఆమె పెళ్లి సమయంలో.. తన లైఫ్ అద్భుతంగా ఉండబోతుందనేలా ఊహించుకుని ఉంటుందనేది వాస్తవం. కానీ, ‘యశోద’ టీజర్‌లో ఎలా అయితే ఆమెకు అంతా రివర్స్ జరిగిందో.. తన రియల్ లైఫ్‌లో కూడా ఆమె ఊహించుకున్న దానికి అంతా రివర్సే జరిగింది. ఈ మధ్య కరణ్ జోహార్ షో లో తెలిపిన దాని ప్రకారం.. ఆమె చాలా కాలం నుండి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం ఆమె బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల సినిమాలపైనే మనసు పెట్టి.. తెలుగు సినిమాలేవీ పెద్దగా ఒప్పుకోవడం లేదు. దీనికోసం ఆమె  ముంబైలో కూడా మకాం పెట్టేసింది. 



Updated Date - 2022-09-10T03:08:39+05:30 IST