Yashoda Teaser: సమంతలో మరో కొత్త కోణం..

ABN , First Publish Date - 2022-09-09T16:48:42+05:30 IST

సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం యశోద (Yashoda). ఫీమేల్ సెంట్రిక్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

Yashoda Teaser: సమంతలో మరో కొత్త కోణం..

సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం యశోద (Yashoda). ఫీమేల్ సెంట్రిక్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం దీనికి అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. హరి–హరీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.


యశోద మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆసక్తిని రేపాయి. ఇంతకముందు వదిలిన గ్లింప్స్ ద్వారా సినిమాలో ఏదో ఆసక్తికరమైన విషయం ఉందని హింట్ ఇచ్చారు. దాంతో ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే యశోద మూవీలో సమంత గర్భవతి పాత్రలో కనిపించనుందని అర్థమవుతుంది.  టీజర్‌లో డాక్టర్.. సమంతకు గర్భవతిగా ఉన్నప్పుడు ఏ పనులైతే చేయకూడదని సూచిస్తుందో అలాంటి పనులే చేస్తుంది. 


తనను ఎవరో చంపడానికి ప్రయత్నించడం.. వాళ్ళ నుంచి సమంత తప్పించుకోవడం.. విలన్లతో ఫైట్‌ను.. తాజా టీజర్‌లో చూపించారు. గర్భవతి అయిన సమంతను విలన్స్ ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు..? అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇప్పటివరకు తన కెరీర్‌లో కమర్షియల్ సినిమాలతో పాటు మజిలీ వంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేసిన సమంత, ఇప్పుడు నటిస్తున్న యశోద మూవీలో తనలోని కొత్త కోణాన్ని చూపించబోతుందని, దీనికి కోసం బాగానే శ్రమించిందని అర్థమవుతోంది. మరి ఈ మూవీ రిలీజైయ్యాక సమంతకి ఎలాంటి సక్సెస్ వస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.



Updated Date - 2022-09-09T16:48:42+05:30 IST