Yashoda: పాట మినహా సమంత సినిమా పూర్తి!

ABN , First Publish Date - 2022-07-11T20:27:49+05:30 IST

సమంత కీలక పాత్ర పోషిస్తున్న ‘యశోద’ చిత్రం షూటింగ్‌ ఒక పాట మినహా టాకీ మొత్తం పూర్తయింది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై హరి–హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘’

Yashoda: పాట మినహా సమంత సినిమా పూర్తి!

సమంత (Samantha)కీలక పాత్ర పోషిస్తున్న ‘యశోద’ (Yashoda)చిత్రం షూటింగ్‌ ఒక పాట మినహా టాకీ మొత్తం పూర్తయింది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై హరి–హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘’సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్‌తో యశోద చిత్రాన్ని తెరకెక్కించాం. 100 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది. సాంగ్‌ మినహా టాకీ షూట్‌ మొత్తం పూర్తయింది. ఒకవైపు గ్రాఫిక్స్‌ పని జరుగుతుండగా  ఈ నెల 15 నుంచి డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలుపెడుతున్నాం. తదుపరి ఇతర భాషల్లో కూడా అనువాదం జరుగుతుంది. ప్రస్తుత మార్కెట్‌ దృష్ట్యా ప్యాన్‌ ఇండియా చిత్రంగా విడుదల చేయడానికి పూర్తిగా సిద్థమాయ్యాకే మంచి తేదీ చూసుకుని విడుదతేఏదీని ప్రకటిస్తాం. రానున్న రోజుల్లో చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్‌ విడుదల మరియు ఇతర వివరాలు తెలియజేస్తాం. సమంత ‘యశోద పాత్రని సొంతం చేసుకున్న తీరు చూేస్త చాలా గర్వంగా ఉంది. చాలా ఏకాగ్రతతో, పూర్తి డెడికేషన్‌తో యాక్షన్‌ మరియు ఇతర సన్నివేశాలు అద్భుతంగా చేసింది. సీట్‌ ఎడ్జ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని పూర్తిగా సిద్థం చేస్తున్నాం’’ అని చెప్పారు. (Yashoda talkie part completed)


సమంత, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, శత్రు, కల్పికా గణేష్‌, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, లైన్‌ ప్రొడ్యూసర్‌: విద్య శివలెంక

Updated Date - 2022-07-11T20:27:49+05:30 IST