Yashoda : విడుదల వాయిదా?

ABN , First Publish Date - 2022-07-01T15:17:27+05:30 IST

ప్రస్తుతం సమంత (Samantha) తెలుగులో గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో ‘శాకుంతలం’ (Shakunthalam), హరి - హరీశ్ (Hari - Harish) దర్శకద్వయం తెరకెక్కిస్తున్న ‘యశోద’ (Yashoda) చిత్రాలతో బిజీగా ఉంది. ‘

Yashoda : విడుదల వాయిదా?

ప్రస్తుతం సమంత (Samantha) తెలుగులో గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో ‘శాకుంతలం’ (Shakunthalam), హరి - హరీశ్ (Hari - Harish) దర్శకద్వయం తెరకెక్కిస్తున్న ‘యశోద’ (Yashoda) చిత్రాలతో బిజీగా ఉంది. ‘శాకుంతలం’ చిత్రం ఎప్పుడో టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతోంది. ఇంత వరకూ దీనికి సంబంధించిన టీజర్ విడుదల కాలేదు. ఈ ఏడాదే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ‘యశోద’ విషయానికొస్తే.. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. శ్రీదేవి మూవీస్ (Sridevi Movies) బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ (Shivalenka Krishnaprasad) నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను జూలై 12న విడుదల చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. కానీ ఇంతవరకు ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దాంతో సినిమా విడుదలపై సందేహాలు నెలకొన్నాయి.


‘యశోద’ చిత్రం షూటింగ్ శరవేగంగా చేసుకుంటూ వచ్చారు. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ.. ఉన్నట్టుండి మేకర్స్ మౌనం వహించడంతో చిత్రం విడుదల వాయిదా పడుతుందనే మాట బలంగా వినిపిస్తోంది. ఒక విధంగా ఇది మంచి నిర్ణయమే. ఆ వారంలో విపరీతమైన పోటీ నెలకొంది. ‘లాల్ సింగ్ ఛద్దా (lal Singh Chadda), కోబ్రా (Cobra), మాచర్ల నియోజకవర్గం (Macharla Niyojakavargam), లాఠీ’ (Lathi) సినిమాలు విడుదలడానికి రెడీగా ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ను వదలుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అలాంటప్పుడు యశోద కూడా బరిలోకి దిగడం రిస్క్ అవుతుంది. అసలే ఆడియన్స్ థియేటర్స్ కు మునుపటిలా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘యశోద’ లాంటి సినిమాలు వీలైనంత సోలోగా రావడం బెటర్ అనిపించుకుంటుందని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. 


ఉన్నిముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, కల్పిక గణేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఓబేబీ (Oh Baby) చిత్రం తర్వాత సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. యశోద అనే అమ్మాయి జీవితంలో అనూహ్యరీతిలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారమే ఈ సినిమా కథాంశం. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మణిశర్మ (Manisharma) సంగీతం అందిస్తున్నారు. మరి నిజంగానే యశోద చిత్రం వాయిదా పడుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-07-01T15:17:27+05:30 IST