‘సామీ.. నా సామీ’ పాటకు యషికా స్టెప్స్.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-01-18T23:59:17+05:30 IST

గత యేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణగండం నుంచి బయటపడిన నటి యషికా ఆనంద్‌ ఇపుడు పూర్తిగా కోలుకుంది. దాదాపు మూడు నెలలకు పైగా ఆస్పత్రిలో బెడ్‌కే పరిమితమైన ఈ భామ... వైద్యుల పర్యవేక్షణ, ఫిజియోథెరపిస్టుల

‘సామీ.. నా సామీ’ పాటకు యషికా స్టెప్స్.. వీడియో వైరల్

గత యేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణగండం నుంచి బయటపడిన నటి యషికా ఆనంద్‌ ఇపుడు పూర్తిగా కోలుకుంది. దాదాపు మూడు నెలలకు పైగా ఆస్పత్రిలో బెడ్‌కే పరిమితమైన ఈ భామ... వైద్యుల పర్యవేక్షణ, ఫిజియోథెరపిస్టుల సలహాలు సూచనలతో మామూలు స్థితికి చేరుకుంది. అంతేకాదు, ప్రమాదానికి ముందు ఆమె అంగీకరించిన చిత్రాల షూటింగ్స్‌లో కూడా పాల్గొంటోంది. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకుని  సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. 


టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’లోని ‘సామీ.. నా సామీ’ పాటకు.. ఆమె లంగావోణి ధరించి అదిరిపోయే స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్‌ మీడియా ఖాతాలలో షేర్‌ చేయడంతో అది వైరల్‌ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఇలా నిన్ను చూడటం సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ‘ఊ అంటావా... ఊఊ అంటావా.. పాటకు కూడా డ్యాన్స్ చేయండి’ అంటూ ఆమెను కోరుతున్నారు. కాగా, ఈమె కోలీవుడ్‌కు ‘ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు’ (చీకటి గదిలో చితక్కొట్టుడు) అనే చిత్రం ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే.



Updated Date - 2022-01-18T23:59:17+05:30 IST