ఆమిర్ ఖాన్‌ను దాటేయబోతున్న yash..!

ABN , First Publish Date - 2022-05-04T21:30:42+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’. 2018లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది.

ఆమిర్ ఖాన్‌ను దాటేయబోతున్న yash..!

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’. 2018లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ విడుదలైన తొలిరోజు నుంచే బాలీవుడ్‌లో రికార్డులను తిరగరాస్తుంది. కొత్త సినిమాలు విడుదలవుతున్నా ఈ సినిమాకు గట్టి పోటీని ఇవ్వలేకపోతున్నాయి. ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పినా ఈ చిత్రం మరో అరుదైన ఫీట్‌ను సాధించేందుకు సిద్ధమవుతోంది. 


ఇప్పటికే ఈ సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్నా భారీ వసూళ్లు రాబడుతూనే ఉంది. రంజాన్ సందర్భంగా విడుదలైన ‘రన్ వే-34’, ‘హీరోపంటీ-2’ చిత్రాలు కూడా ‘కెజియఫ్: చాప్టర్-2’ జోరును అడ్డుకోలేకపోతున్నాయి. ఇప్పటికీ సినీ ప్రేక్షకులకు మొదటి ఛాయిస్‌గా ఈ చిత్రమే నిలుస్తుండటం విశేషం. ఈ తరుణంలో ఇప్పటి వరకు‌ హిందీలో రూ.382కోట్ల వసూళ్లు రాబట్టి మూడో స్థానంలో ఉన్న ఈ మూవీ త్వరలోనే రెండో స్థానానికి చేరుకోనుంది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ సినిమా రూ.387.39కోట్ల వసూళ్లతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా.. ‘బాహుబలి-2’ రూ.511కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక తెరల్లో మే 6న హాలీవుడ్ మూవీ ‘‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవెర్స్ ఆఫ్ మాడ్‌నెస్’ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే కోట్లాది రూపాయాల ఆదాయం వచ్చింది. ఒకవేళ సినిమాకు మంచి టాక్ వస్తే ‘కెజియఫ్’ జోరుకు బ్రేకులు పడే అవకాశం ఉంది.

Updated Date - 2022-05-04T21:30:42+05:30 IST