అమెరికాలో రికార్డు క్రియేట్ చేసిన KGF Chapter 2.. యశ్ మూవీ ఏం సాధించిందంటే..

ABN , First Publish Date - 2022-04-15T17:39:29+05:30 IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ 2018లో విడుదలై సృష్టించిన సంచలనాలు అందరికి తెలిసిందే...

అమెరికాలో రికార్డు క్రియేట్ చేసిన KGF Chapter 2.. యశ్ మూవీ ఏం సాధించిందంటే..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ 2018లో విడుదలై సృష్టించిన సంచలనాలు అందరికి తెలిసిందే. అప్పటినుంచి దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఆతృతగా, ఆసక్తిగా ఎదురుచూసిన ‘కేజీఎఫ్ 2’ పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడులైన ఈ మూవీ మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది.


ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10వేల స్ర్కీన్లలో విడుదలైన ఈ మూవీ అన్ని చోట్ల మంచి కలెక్షన్లను కొల్లగొడుతోంది. కాగా.. ఇండియాలోనే కాకుండా అమెరికాలో సైతం ఈ సినిమా ఓ రికార్డుని క్రియేట్ చేసింది. అక్కడ 1 మిలియన్ డాల్లర్ల కలెక్షన్లని సాధించిందట ఈ చిత్రం. అమెరికాలో ఆ ఫీట్ సాధించిన మొట్టమొదటి కన్నడ చిత్రం ఇదేనట. దీనికి సంబంధించి ప్రముఖ సినీ విశ్లేషకుడు ఓ ట్వీట్ చేశాడు. అందులో.. ‘యూస్‌లో మిలియన్ డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’.. ఆ ఫీట్ సాధించిన కన్నడ సినిమా ఇదే’ అంటూ రాసుకొచ్చాడు.



Updated Date - 2022-04-15T17:39:29+05:30 IST