KGF 2 @ రూ. 240 కోట్లు.. విడుదలైన 6 రోజుల్లోనే హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు..!

ABN , First Publish Date - 2022-04-20T20:59:23+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్: చాప్టర్-1’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది.

KGF 2 @ రూ. 240 కోట్లు.. విడుదలైన 6 రోజుల్లోనే హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు..!

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్: చాప్టర్-1’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ బాలీవుడ్‌లో భారీ వసూళ్లను రాబడుతుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే దాదాపుగా రూ. 240కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఇదే దూకుడును ప్రదర్శిస్తే రాబోయే రోజుల్లో ‘దంగల్’ లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమిస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


పాన్ ఇండియాగా తెరకెక్కిన ‘కెజియఫ్-2’ సినిమా ఏప్రిల్ 14న విడుదలైంది. సినిమా థియేటర్స్‌కు సందడిని తీసుకు వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.600కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. వరల్డ్ వైడ్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో తొమ్మిది స్థానంలో నిలిచింది. యశ్ ఈ చిత్రంలో రాకీ భాయ్ అనే పాత్రలో అభిమానులను అలరించాడు. శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2022-04-20T20:59:23+05:30 IST