Prabhas సినిమాలో రాకీభాయ్?

ABN , First Publish Date - 2022-06-29T17:03:39+05:30 IST

పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓంరౌత్ (Om Raut) ‘ఆదిపురుష్’ (Aadipurush) టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతోంది.

Prabhas సినిమాలో రాకీభాయ్?

పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓంరౌత్ (Om Raut) ‘ఆదిపురుష్’ (Aadipurush) టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతోంది. నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K) చిత్రం షూటింగ్ దశలో ఉంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ‘సలార్’ (Salaar) మూవీ .. షూటింగ్ చివరిదశలో ఉంది. సందీప్ రెడ్డి వంగా (Sandeepreddy Vanga) ‘స్పిరిట్’ (Spirit) చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనుంది. ప్రశాంత్ నీల్ రీసెంట్ మూవీ ‘కేజీఎఫ్ 2’ (KGF 2) అఖండ విజయంతో ‘సలార్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను ఆసక్తికరమైన కథాకథనాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు అన్నిరకాలుగానూ శ్రమిస్తున్నాడు దర్శకుడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో అభిమానుల కోసం బోలెడన్ని సర్ ప్రైజుల్ని రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా ‘సలార్’ చిత్రంలో  రాకీ భాయ్ (Rockey Bhai) క్యామియో రోల్ చేయబోతున్నట్టు సమాచారం.


‘కేజీఎఫ్ 2’ సూపర్ సక్సెస్ తో కన్నడ రాక్ స్టార్ యశ్ (Yash) .. ప్రభాస్ లాగానే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అన్ని భాషల్లోనూ అతడికి భారీ క్రేజ్ ఏర్పడింది. దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతోనే యశ్ స్ర్కీన్ ప్రెజెన్స్‌ను.. ‘సలార్’ చిత్రానికి హైలైట్‌గా మార్చనున్నాడని తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ తరహాలోనే ‘సలార్’ చిత్రం ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో థ్రిల్ చేస్తుందని చెబుతున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి పలు ప్రభాస్ పిక్స్ లీకయి.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ప్రభాస్ లుక్స్ అభిమానుల్ని తెగ ఊరించాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


బొగ్గుగనుల మాఫియా నేపథ్యంలో ‘సలార్’ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్ (Shruthi Haasan) కథానాయికగా నటిస్తుండగా.. జగపతి బాబు (Jagapathi Babu) విలన్ గా ఆకట్టుకోబోతున్నారు. గతంలో విడుదలైన జేబీ లుక్ కు మంచి స్పందన దక్కింది. మధు గురుస్వామి, ఈశ్వరీ రావు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతం అందిస్తుండగా.. భువన్ గౌడ (Bhuvangowda)ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు.  వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో యశ్ నటిస్తున్నాడో లేదో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-06-29T17:03:39+05:30 IST