'లక్కీ స్టార్'గా వస్తున్న పాన్ ఇండియా స్టార్ Yash

Twitter IconWatsapp IconFacebook Icon

కె.జి.ఎఫ్-1 (KGF -1), కె.జి.ఎఫ్-చాప్టర్-2 ((KGF -2) చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యష్ నటించిన కన్నడ చిత్రం 'లక్కీ' (Lucky) ఘన విజయం సాధించింది.  ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో 'లక్కీ స్టార్' (Lucky Star)గా విడుదల కాబోతోంది. కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి (Radhika Kumar Swamy) స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ (Raviraj) ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. డా.సూరి (Dr.Suri) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ (Yash) సరసన రమ్య (Ramya) హీరోయిన్‌గా నటించింది. లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. 




ఈ సందర్భంగా 'లక్కీ స్టార్' చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ రిలీజ్ చేసి... కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రవిరాజ్, ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చిన గురు చరణ్, సంభాషణల రచయిత సూర్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేశవ్ గౌడ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ పాల్గొన్నారు. కేజీఎఫ్ స్టార్ యష్ చిత్రానికి పనిచేసే అవకాశం లభించడం పట్ల గీత రచయిత గురు చరణ్, డైలాగ్ రైటర్ సూర్య సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, చిత్ర నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ.. 'తెలుగులోనూ స్ట్రెయిట్‌గా  సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అందుకే, ఈ చిత్రానికి చాలా ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చినా... మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. తెలుగులోనూ ఈ సినిమా చాలా బాగా ఆడి, మాకు మంచి శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం. యష్ పెర్ఫార్మెన్స్, రమ్య గ్లామర్, 'రాబర్ట్' ఫేమ్ అర్జున్ జన్య మ్యూజిక్ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలు' అని తెలిపారు. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.