ఆ ఫీట్ సాధించిన నాలుగో ఇండియన్ సినిమాగా ‘కెజియఫ్: చాప్టర్-2’

ABN , First Publish Date - 2022-04-30T21:41:37+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు.

ఆ ఫీట్ సాధించిన నాలుగో ఇండియన్ సినిమాగా ‘కెజియఫ్: చాప్టర్-2’

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమా అరుదైన ఫీట్‌ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. గతంలో ఈ మార్కును ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ‘దంగల్’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ మాత్రమే చేరాయి. దీంతో రూ. 1000కోట్ల కలెక్షన్లు సాధించిన నాలుగో ఇండియన్ సినిమాగా ‘కెజియఫ్:2’ రికార్డు సృష్టించింది.


‘కెజియఫ్: చాప్టర్-2’ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలైంది. బాలీవుడ్‌లో ఈ చిత్రానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. బాలీవుడ్  బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రికార్డు స్థాయిలో రూ. 50కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో యశ్ నటన మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ప్రశాంత్ టేకింగ్‌కు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రవీనా టండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరిరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2022-04-30T21:41:37+05:30 IST