KGF 2 లో అనంత్‌ నాగ్ ఎందుకు లేరన్నది వెల్లడించిన Prashanth Neel.. ప్రకాశ్ రాజ్‌కు ముందే చెప్పానంటూ..

ABN , First Publish Date - 2022-04-12T21:03:26+05:30 IST

కన్నడ హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’. ఎటువంటి అంచనాలు లేకుండా..

KGF 2 లో అనంత్‌ నాగ్ ఎందుకు లేరన్నది వెల్లడించిన Prashanth Neel.. ప్రకాశ్ రాజ్‌కు ముందే చెప్పానంటూ..

కన్నడ హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’. ఎటువంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. అయితే కేజీఎఫ్ 1లో రాకీ తిరుగుబాటుకు సంబంధించిన వాస్తవ సంఘటనలను వివరించే వివాదాస్పద పుస్తకం ఎల్ డొరాడో రచయిత ఆనంద్ ఇంగలగి పాత్రను అనంత్ నాగ్ అనే కన్నడ నటుడు పోషించాడు. అయితే సీక్వెల్ ట్రైలర్‌లో మాత్రం ఈ నటుడి బదులు ప్రకాశ్ రాజ్ కనిపించాడు. దీనిపై తాజాగా ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్, హీరో యశ్ వేరు వేరు ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చారు.


ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘అనంత్ సర్ KGF 2లో నటించకపోవడం గురించి నేను కూడా నిరాశ చెందాను. కానీ అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. నేను వెళ్లి సినిమాలో నటించండని ఎవరినీ బ్రతిమాలలేను. అందుకే.. మేము కొత్త ప్లాట్‌తో మీ ముందుకు వచ్చాం. కేజీఎఫ్ 2లో ఎందుకు నటించలేదో ఆయనే చెప్పాలి. నేను దాని గురించి మాట్లాడం బాగోదు. ఆయన నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. ఆయన కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక లెజెండ్. ఇంతకుమించి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. అయితే అనంత్ చేసిన పాత్ర వంటిదే సీక్వెల్‌లో చేయాల్సి ఉంటుందని, దానికి కారణాలను సైతం ముందే ప్రకాశ్‌రాజ్‌‌కి వివరించాను. ఆయన కూడా ఒప్పుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.


అంతకుముందే ఓ ఇంటర్య్వూలో యశ్ మాట్లాడుతూ.. ‘ఆయన స్థానంలో ప్రకాష్ రాజ్ రాలేదు. దయచేసి సినిమా చూడండి మీకే అర్థమవుతుంది. అనంత్ సార్ నా తండ్రి లాంటి వాడు. ఆయన చేతులు పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చాను. కేజీఎఫ్ 2కి ఆయన ఎంతో సహాయం చేశారు. సినిమాకు ఎంతో గౌరవం తీసుకొచ్చారు. ఈ సినిమా నుంచి దూరంగా ఉండటం ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన పాత్ర గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే దర్శకుడిని అడగడం మంచిది. ఎందుకంటే ఆయనే సరైన సమాధానాలు ఇవ్వగలరని నా ఉద్ధేశం’ అని తెలిపాడు.

Updated Date - 2022-04-12T21:03:26+05:30 IST