నాకు నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది: యామీ గౌతమ్

ABN , First Publish Date - 2022-03-13T17:21:23+05:30 IST

‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటి యామీ గౌతమ్. ఆ మూవీ మంచి హిట్ సాధించడంతో ఈ బ్యూటీ..

నాకు నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది: యామీ గౌతమ్

‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటి యామీ గౌతమ్. ఆ మూవీ మంచి హిట్ సాధించడంతో ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనంతరం కూడా సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసి మంచి గుర్తింపు సాధించింది. ఈ భామ తాజా చిత్రం ‘ఏ థార్స్‌డే’ హట్‌స్టార్‌లో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.


యామీ మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ నేను ప్రొఫెషనల్‌గా చాలా ఎదిగాను. ఏది చేస్తే మంచిదో తెలుసుకోగలిగాను. అయితే నాకు వచ్చే అవకాశాలకు, నా ఆలోచనలకు ఎంతో వ్యత్యాసం ఉంది. కానీ నచ్చకపోయినా కొన్ని మూవీస్‌ని చేయాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది.


యామీ ఇంకా మాట్లాడుతూ.. ‘మొదటి సినిమా ‘విక్కీ డోనర్’ చేసినప్పుడు నా ఆలోచనా విధానం డిఫరెంట్‌గా ఉంది. కెరీర్‌లో ఎత్తుపల్లాలు, విజయాలు అపజయాలు లేకపోతే.. మనకు ఏది మంచిదో తెలుసుకోవడం కష్టం. మొదట్లో సినిమా ఫెయిల్ అయితే చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ప్రస్తుతం నా ఆలోచనా విధానం మారింది. అదే మిమ్మల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తుంది.


కెరీర్ ప్రారంభంలో నాకు చాలా అవకాశాలు వచ్చాయి. అందులో మంచి అవకాశాలను సెలెక్ట్‌ చేసుకున్నాను. అవి సరైనవి కాకపోవచ్చు. చాలాసార్లు నాకు సరిపోని కథలను సైతం చేశాను. చేయాల్సి వచ్చింది. కానీ నాకు ఆపర్చునీటీ ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఎప్పటికీ గౌరవిస్తాను’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-03-13T17:21:23+05:30 IST