‘శ్యామ్‌ సింగరాయ్‌’ రచయిత తదుపరి అస్త్రాలివే..

ABN , First Publish Date - 2021-12-22T01:29:58+05:30 IST

ఈ కథ విన్న వెంటనే నానిగారు ఓకే చేశారు. ఆయన ఈ చిత్రంలో పలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు. వినూత్నమైన కథాంశంతో వస్తోన్న ఈ చిత్రం.. రచయితగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఈ కథను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన..

‘శ్యామ్‌ సింగరాయ్‌’ రచయిత తదుపరి అస్త్రాలివే..

న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్ తెరకెక్కించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి కథను సత్యదేవ్ జంగా అందించారు. ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ‘శ్యామ్ సింగరాయ్’ కథను ఉన్నత శ్రేణిలో చిత్రీకరించిన దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్‌కు, హీరో నానికి, నిర్మాత వెంకట్ బోయనపల్లికి చిత్ర రచయిత సత్యదేవ్ జంగా ధన్యవాదాలు తెలిపారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ కథ విన్న వెంటనే నానిగారు ఓకే చేశారు. ఆయన ఈ చిత్రంలో పలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు. వినూత్నమైన కథాంశంతో వస్తోన్న ఈ చిత్రం.. రచయితగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఈ కథను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు, నిర్మాత, హీరోలకి నా ధన్యవాదాలు. త్వరలో హర్రర్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను. నేను రెడీ చేసిన ఒక ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీని ప్రముఖ బ్యానర్ ఓకే చేసింది. త్వరలోనే వారు ఈ చిత్ర వివరాలను ప్రకటించనున్నారు. అలాగే ఒక స్టార్ హీరో కోసం సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ సిద్ధం చేస్తున్నాను. ఇంకోటి కాశీ బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడిక్ లవ్ స్టోరీ కూడా రెడీ అవుతోంది. త్వరలోనే వాటి వివరాలను కూడా తెలియజేస్తాను..’’ అని తెలిపారు.

Updated Date - 2021-12-22T01:29:58+05:30 IST