స్త్రీమూర్తి - సర్వశక్తివంతమైన వ్యాక్సిన్

ABN , First Publish Date - 2022-03-10T02:39:14+05:30 IST

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మంగళవారం 98.3 మిర్చి ‘షీ వ్యాక్సిన్’ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రేడియో స్టేషన్స్‌లో మంగళవారం జరిగిన అన్ని కార్యక్రమాలను

స్త్రీమూర్తి - సర్వశక్తివంతమైన వ్యాక్సిన్

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మంగళవారం 98.3 మిర్చి ‘షీ వ్యాక్సిన్’ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రేడియో స్టేషన్స్‌లో మంగళవారం జరిగిన అన్ని కార్యక్రమాలను మొత్తం మహిళా ఆర్జేలే నిర్వహించడం విశేషం. రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఒక్కటే పరిష్కారం ‘ఆమె’.. అంటే ఒక మహిళ మాత్రమే! యుగయుగాలుగా, తరతరలుగా ఈ సమాజం కోసం ‘స్త్రీ శక్తి’ ఒక ఇమ్యూనిటీగా పని చేస్తోంది. ఆమే మన పరిపూర్ణమైన జీవితానికి ఒక ‘వ్యాక్సిన్’ అనే ఆలోచనతో ఈ కాన్సెప్ట్ రూపొందించారు. ఎంతో ఉత్సాహంగా సాగిన మిర్చి రేడియో కార్యక్రమాలన్నింటిలో... లోకల్ ‘షీ-హీరోస్’ని వెతికి పట్టుకొని, వారి ఇన్స్పైరింగ్ స్టోరీలను ఆర్జేలు మిర్చి శ్రోతలతో పంచుకున్నారు. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన అనేకమంది అసాధారణ స్త్రీమూర్తులను శ్రోతలకు పరిచయం చేశారు. రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు, ‘షీ వ్యాక్సిన్’ ఎలా పని చేస్తుందో వినోదాత్మకంగా వివరించారు.


“వేరియంట్ ఏదైనా – ఒక్కటే వ్యాక్సిన్

సమస్య ఏదైనా – ఒక్కటే...  షీ వ్యాక్సిన్” అంటూ..

ఒక మహిళ జీవితంలో ఉండే భయాలు, బాధ్యతలు, సెలబ్రేషన్స్, ప్రేమ, అనుబంధాలు... ఇలా ప్రతి ఒక్క విషయం మీద వుమెన్ ఆర్జేలు మాట్లాడారు. సీఆర్పీఎఫ్‌లో పని చేసే తెగువ కల మగువ మొదలుకుని... పది రూపాయలకు 5 ఇడ్లీలు అమ్మే ఒక మహిళా సేవామూర్తి వరకు పలువురు అద్వితీయ మహిళా స్ఫూర్తి ప్రదాతలను శ్రోతలకు పరిచయం చేశారు.

Updated Date - 2022-03-10T02:39:14+05:30 IST