Bollywood : కొడుకు ఫెయిల్ .. మరి తండ్రి?

ABN , First Publish Date - 2022-08-30T17:55:29+05:30 IST

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ‘లాల్ సింగ్ చడ్డా’ (Lal Singh Chadda) మూవీతో తన బాలీవుడ్ కలను నెరవేర్చుకున్న సంగతి తెలిసిందే. అవకాశం అనూహ్యంగా వచ్చినందుకు మురిసిపోయిన చైతూను ఆ సినిమా డిజాస్టర్ పెద్ద షాకిచ్చింది.

Bollywood : కొడుకు ఫెయిల్ .. మరి తండ్రి?

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ‘లాల్ సింగ్ చడ్డా’ (Lal Singh Chadda) మూవీతో తన బాలీవుడ్ కలను నెరవేర్చుకున్న సంగతి తెలిసిందే. అవకాశం అనూహ్యంగా వచ్చినందుకు మురిసిపోయిన చైతూను ఆ సినిమా డిజాస్టర్ పెద్ద షాకిచ్చింది. హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ (Foresh Gump) ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan), కరీనా కపూర్ (Kareena Kapoor) జంటగా నటించగా.. నాగచైతన్య (Naga Chaitanya) కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ చైతుకు ప్లస్ అవకపోగా.. మైనస్ అయింది. దాంతో వీలైనంత త్వరగా ఆ డిజాస్టర్‌ను మరిచిపోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి నాగార్జున (Nagarjuna) వంతు వచ్చింది. 


‘శివ’ (Shiva) సినిమాతోనే తొలి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. తర్వాత అమితాబ్ (Amitab), శ్రీదేవి (Sridevi) ‘ఖుదాగవా’ (Khudagawa) లో నటించారు. ఆపై ‘మిస్టర్ బేచారా, అంగారే’ లాంటి సినిమాల్లోనూ నటించి మెప్పించారు. తాజాగా నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ (Brastra) భారీ బాలీవుడ్ మూవీలో ప్రధాన పాత్ర పోషించనుండడం విశేషం.  రణబీర్ కపూర్ (Ranabeer Kapoor) హీరోగా నటిస్తుండగా బిగ్ బీ  కీలక పాత్ర పోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నాగ్ కాంబో బాగా కలిసి వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి తొలిసారిగా నటించిన ‘ఖుదాగవా’ బాలీవుడ్ లో మంచి హిట్టయింది. అమితాబ్ తెరపై కొద్దినిమిషాల సేపు కనిపించిన ‘మనం’ (Manam) అక్కినేని ఫ్యామిలీకి మెబరబుల్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సెంటిమెంట్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి బాగా వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారు.  


త్రిమూర్తులైన బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల తత్వాన్ని సోషియో ఫాంటసీ కథాంశంగా రూపొందిస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం మొత్తం మూడు భాగాలుగా రాబోతోంది. అందులోని మొదటి భాగం ‘శివ’ సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం విడుదల కాబోతోంది.  అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున పాత్ర పేరు అనిష్. బ్రహ్మాంశతో పుట్టిన వాడు. మరి ఈ సినిమాతో నాగార్జున సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి. 

Updated Date - 2022-08-30T17:55:29+05:30 IST