పారితోషికం తీసుకోకుండానే సినిమాలో నటించిన Amitabh Bachchan

ABN , First Publish Date - 2021-10-11T20:39:12+05:30 IST

బాలీవుడ్ షెహన్‌షా అమితాబ్ బచ్చన్ అన్ని సినీ ఇండస్ట్రీల్లో నటిస్తుంటారు. బిగ్‌బీ‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒక సీన్‌లో అయినా ఆయనను నటించపజేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు.

పారితోషికం తీసుకోకుండానే సినిమాలో నటించిన Amitabh Bachchan

బాలీవుడ్ షెహన్‌షా అమితాబ్ బచ్చన్ అన్ని సినీ ఇండస్ట్రీల్లో నటిస్తుంటారు. బిగ్‌బీ‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒక సీన్‌లో అయినా ఆయనను నటించపజేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. ఆయన డేట్స్ ఇస్తే ఎంత పారితోషికం ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. టాలీవుడ్‌లోను అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో మెరుస్తుంటారు. అంత డిమాండ్‌లో ఉన్న వ్యక్తి ఒక సినిమాకు పారితోషికం తీసుకోకుండానే నటించారు. ఆయన సహ నటుడు ఒకరు ఈ వివరాలను మీడియాతో పంచుకున్నారు.


అమితాబ్ మరాఠీకి చెందిన ఒక చిత్రంలో నటించారు. ఆ సినిమా పేరు AB ఆనీ CD. ఆ మూవీలో విక్రమ్ గోఖలే, సుభోద్ భావే, సయలి సంజీవ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి బిగ్ బీ ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే నటించారని ఆయనతో కలిసి నటించిన విక్రమ్ గోఖలే చెప్పారు. ‘‘ మేం 55ఏళ్లుగా ఒకరికి మరొకరం తెలుసు. ఇద్దరం కలిసి అనేక చిత్రాల్లో నటించాం. అమితాబ్ నటించిన మొదటి మరాఠీ చిత్రం AB ఆనీ CD. నీ కోసమే ఈ చిత్రం చేస్తున్నానని బిగ్ బీ చెప్పారు. ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే ఆయన ఈ సినిమాకు పనిచేశారు. ఆ సినిమా షూటింగ్‌కు వచ్చినప్పుడు ఆయన సొంతంగా 20జతల కాస్టూమ్స్ తెచ్చుకునేవారు ’’ అని విక్రమ్ గోఖలే వివరించారు. 


అమితాబ్ బచ్చన్ నేడు 79వ పుట్టినోరజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్, మమ్ముట్టి, నాగర్జున, మహేశ్ బాబు, రష్మిక మందన్న, పీసీ. శ్రీరామ్ తదితరులు ఆయనకు విషెస్ చెప్పారు. బిగ్ బీ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, బటర్ ప్లై, మేడే, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు.


Updated Date - 2021-10-11T20:39:12+05:30 IST