అగస్త్యతో... అవస్తి!

ABN , First Publish Date - 2022-07-06T05:49:50+05:30 IST

‘పూలరంగడు’, ‘చుట్టాలబ్బాయి’ చిత్రాలతో విజయాలు అందుకొన్నారు వీరభద్రమ్‌. ఆయన దర్శకత్వంలో ఇప్పుడో చిత్రం రూపుదిద్దుకుంటోంది....

అగస్త్యతో... అవస్తి!

‘పూలరంగడు’, ‘చుట్టాలబ్బాయి’ చిత్రాలతో విజయాలు అందుకొన్నారు వీరభద్రమ్‌. ఆయన దర్శకత్వంలో ఇప్పుడో చిత్రం రూపుదిద్దుకుంటోంది. నరేశ్‌ అగస్త్య కథానాయకుడు. నబిషేక్‌, తూము నర్సింహా పటేల్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో కథానాయికగా శ్వేత అవస్తిని ఎంచుకొన్నారు. ఈనెలలోనే షూటింగ్‌ మొదలుకానుంది. నరేశ్‌, అవస్తిలపై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘వీరభద్రమ్‌ అంటే కామెడీ బ్రాండ్‌. ఈసారి ఓ షాకింగ్‌ కథతో వస్తున్నారు. ఆయన చెప్పిన కథ మాకెంతో బాగా నచ్చింది. అందుకే వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాం. అనూప్‌ రూబెన్స్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’న్నారు.

Updated Date - 2022-07-06T05:49:50+05:30 IST