ఆ నటుడికి 16 ఏళ్లకే లవ్ ఫెయిల్యూర్.. ఆ బాధను మర్చిపోయేందుకు పాడు పనులు.. చివరకు..

ABN , First Publish Date - 2021-11-25T16:02:41+05:30 IST

‘విల్’ పేరుతో ఆయన విడుదల చేసిన బుక్‌లో తనకు 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగిన మొదటి బ్రేకప్ గురించి ప్రస్తావించాడు. ఆయన చెప్పిన నిజాలు జనాల్ని షాక్‌కి గురి చేస్తున్నాయి...

ఆ నటుడికి 16 ఏళ్లకే లవ్ ఫెయిల్యూర్.. ఆ బాధను మర్చిపోయేందుకు పాడు పనులు.. చివరకు..

ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన తొలి లవ్ ఫెయిల్యూర్ గురించి తాజా పుస్తకంలో రాశాడు. ‘విల్’ పేరుతో ఆయన విడుదల చేసిన బుక్‌లో తనకు 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగిన మొదటి బ్రేకప్ గురించి ప్రస్తావించాడు. ఆయన చెప్పిన నిజాలు జనాల్ని షాక్‌కి గురి చేస్తున్నాయి...


విల్ స్మిత్ తన 16వ ఏట మొదటి సారి బ్రేకప్ బాధ ఎలా ఉంటుందో రుచి చూశాడట. దాని నుంచీ బయటపడటానికి బోలెడంత మంది స్త్రీలతో విచ్చలవిడిగా శృంగారం చేస్తూ పోయాడట! చివరకు, ఒక దశలో... తాను శారీరికంగా చేస్తున్నది తన మనస్సు ఒప్పుకోక తీవ్రమైన అంతర్మథనానికి లోనయ్యాడట. సెక్స్ జరిపిన ప్రతీసారీ భావప్రాప్తి కలిగే సమయంలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడినని విల్ చెప్పాడు. అంతే కాదు, కొన్నిసార్లు వాంతి చేసేసుకునేవాడట! 


తన లెటెస్ట్ బుక్‌లో ఆనాటి తొలి ప్రియురాలి పేరు కూడా చెప్పాడు విల్ స్మిత్. ఆమె మెలానీ. తనతో మొట్ట మొదటి రొమాంటిక్ రిలేషన్ ఏర్పడ్డాక ఓసారి రెండు వారాల పాటూ మ్యూజిక్ టూర్‌కి వెళ్లి వచ్చాడట. తిరిగి వచ్చిన 16 ఏళ్ల టీనేజర్‌కి లైఫ్‌లో ఫస్ట్ టైం షాక్ ఎదురైంది. తాను ప్రాణంగా ప్రేమించిన మెలానీ మరోకరితో రొమాంటిక్ రిలేషన్ కంటిన్యూ చేస్తోందని తెలిసిందట! 


అమ్మాయి చేతిలో మోసపోయిన ఆనాటి 16 ఏళ్ల అబ్బాయికి బ్రేకప్ బాధ నుంచీ ఎలా బయటపడాలో అస్సలు అర్థం కాలేదట. అప్పటి పరిస్థితి తన పుస్తకంలో వివరించిన విల్ స్మిత్... మనసుకు అయిన గాయం మాన్పే ఔషధం ఏదీ ఉండదు కదా అన్నాడు. దాంతో విపరీతంగా షాపింగ్ చేయటం, శృంగారం ద్వారా బాధని మరిచిపోయే ప్రయత్నం చేశాడట. కానీ, చివరకు అవేవీ వర్కవుట్ కాలేదని కూడా విల్ వివరించాడు! క్రమంగా రోజులు గడిచే కొద్దీ సినిమాలు చేస్తూ పనిలో పడటంతో మానసిక సంక్షోభం తగ్గుముఖం పట్టిందట. వయస్సు పెరిగే కొద్దీ లవ్ ఫెయిల్యూర్ తాలూకూ ప్రభావం కూడా క్షీణించింది. కట్ చేస్తే... 53 ఏళ్ల విల్ స్మిత్‌కి ఇప్పుడు భార్య, ముగ్గురు పిల్లలు.

Updated Date - 2021-11-25T16:02:41+05:30 IST