ఈ రెండు సినిమాలను చూసి.. మా అమ్మానాన్నలు చెడ్డవాళ్లని అనుకున్నా.. ఆసక్తికర వివరాలు వెల్లడించిన సారా అలీఖాన్

ABN , First Publish Date - 2021-11-03T16:55:03+05:30 IST

తన తల్లిదండ్రులు ఇద్దరూ ‘‘చెడ్డవారు’’ అనుకునేదట, సారా అలీఖాన్! ఆమె అప్పట్లో చూసిన రెండు సినిమాలే అందుక్కారణమట. సారా తన చిన్నతనంలో ‘ఓంకారా’, ‘కల్యుగ్’ సినిమాలు చూశానని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అవి చూసి చాలా డిస్టబ్ అయ్యిందట. ఎందుకంటే...

ఈ రెండు సినిమాలను చూసి.. మా అమ్మానాన్నలు చెడ్డవాళ్లని అనుకున్నా.. ఆసక్తికర వివరాలు వెల్లడించిన సారా అలీఖాన్

తన తల్లిదండ్రులు ఇద్దరూ ‘‘చెడ్డవారు’’ అనుకునేదట, సారా అలీఖాన్! ఆమె అప్పట్లో చూసిన రెండు సినిమాలే అందుక్కారణమట. సారా తన చిన్నతనంలో ‘ఓంకారా’, ‘కల్యుగ్’ సినిమాలు చూశానని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అవి చూసి చాలా డిస్టబ్ అయ్యిందట. ఎందుకంటే, ఆ రెండు సినిమాలు ఏమంత ఫ్యామిలీ మూవీస్ కావు. బోలెడు హింస, సెక్స్ ఉంటాయి. అంతకంటే ముఖ్యంగా, ‘ఓంకారా’లో సైఫ్ విపరీతంగా బూతులు మాట్లాడతాడు. ఇక ‘కల్యుగ్’ సినిమాలో సారా తల్లి అమృతా సింగ్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తుంది. ఆమె ఆ సినిమాలో ఓ పోర్న్ సైట్ నడిపించే బిజినెస్‌వుమన్‌గా కనిపిస్తుంది.

చిన్నతనంలో తాను చూసిన ‘ఓంకారా’,‘కల్యుగ్’ చిత్రాల ప్రభావంతో, సారా చాలా రోజుల వరకూ, తన తల్లిదండ్రుల గురించి చెడుగా భావించేదట. తన తండ్రి నిజ జీవితంలో కూడా బూతులు మాట్లాడతాడనీ, తల్లి బూతు వెబ్ సైట్ నిర్వహిస్తుందని భ్రమపడేదట. కొంచెం పెద్దై, లోక జ్ఞానం వచ్చాకగానీ... వారిద్దరూ అలాంటి వారు కారనీ అర్థం కాలేదట. సారా చెప్పిన ఈ మాటల్నిబట్టీ, పిల్లలు ఎలాంటి సినిమాలు చూస్తున్నారో, పెద్ద వాళ్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండటం ఎంతైనా అవసరం అనిపిస్తోంది కదా... 

Updated Date - 2021-11-03T16:55:03+05:30 IST