Bhola Shankar: చిరంజీవి ఎందుకీ సినిమా చేస్తున్నట్టు?

ABN , First Publish Date - 2022-07-22T02:10:53+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ‘భోళా‌శంకర్’ (Bhola Shankar) సినిమా చేస్తున్నాడేంటి? అని ఈ మూవీ అనౌన్స్ అయినప్పుడు టాలీవుడ్‌లోని ప్రతి సినీ అభిమాని అనుకుని ఉంటాడు. దీనికి కారణం మెగాస్టార్ అంతటి హీరో, మెహర్ రమేష్‌

Bhola Shankar:  చిరంజీవి ఎందుకీ సినిమా చేస్తున్నట్టు?

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ‘భోళా‌శంకర్’ (Bhola Shankar) సినిమా చేస్తున్నాడేంటి? అని ఈ మూవీ అనౌన్స్ అయినప్పుడు టాలీవుడ్‌లోని ప్రతి సినీ అభిమాని అనుకుని ఉంటాడు. దీనికి కారణం మెగాస్టార్ అంతటి హీరో, మెహర్ రమేష్‌ (Meher Ramesh)తో సినిమా చేయడమే. చిరుతో సినిమా చేయడానికి ఇండస్ట్రీలోని ప్రతి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటే.. చిరు మాత్రం మెహర్ రమేష్‌తో సినిమా చేస్తున్నానంటూ అందరికీ షాక్ ఇచ్చారు. ‘అన్నా వద్దన్నా.., మాకు నమ్మకం లేదు దొరా’ వంటి ఎన్నో కామెంట్లతో అప్పట్లో ‘భోళా‌శంకర్’పై ట్రోలింగ్ జరిగింది. అభిమానుల అభిమానంలో నిజం ఉంది.. మెహర్ తెలుగులో తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ రిజల్ట్‌ని ఫేస్ చేసిందే. ఎన్టీఆర్ (Jr NTR), వెంకటేష్ (Venkatesh) లాంటి హీరోలు ఛాన్స్ ఇచ్చినా మెహర్ ప్రూవ్ చేసుకోలేదు. అందుకే మెహర్‌తో సినిమా అంటే అందరూ భయపడుతున్నారు. 


కానీ ఎవరికీ తెలియని విషయం, మెహర్ రమేష్ అనే డైరెక్టర్ రీమేక్ టచ్ చేసిన ప్రతి సారి హిట్ ఇచ్చాడు. ‘ఆంధ్రావాలా’ (Andhrawala) ఇక్కడ అట్టర్ ఫ్లాప్, కన్నడలో వీర కన్నడిగా సూపర్ హిట్. ‘ఒక్కడు’ (Okkadu) తెలుగులో హిట్, కన్నడలో ఇదే సినిమా ‘అజయ్’ (Ajay)గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తమిళ ‘బిల్లా’ (Billa) అక్కడ హిట్, ప్రభాస్ ‘బిల్లా’ ఇక్కడ యావరేజ్. సో మెహర్ స్ట్రెయిట్ సినిమాలతో డిజప్పాయింట్ చేశాడేమో కానీ... రీమేక్ సినిమాని టచ్ చేసి ఫ్లాప్ ఇవ్వడం అనేది మెహర్ ఫిల్మోగ్రఫీలోనే లేదు. తను కథని రాయడంలో ఫెయిల్ అయ్యాడేమో కానీ ఆల్రెడీ రెడీగా ఉన్న కథని సూపర్‌గా ప్రెజెంట్ చేయడంలో మెహర్ ఏ రోజు ఫెయిల్ అవ్వలేదు. పైగా ‘భోళా‌శంకర్’ హిట్ అవుతుంది అని నమ్మడానికి ఇంకో రీజన్... ‘వేదాళం’ (Vedalam) సినిమాలో ఉన్న ఎలిమెంట్స్. 


లవ్, యాక్షన్, ఎలివేషన్ సీన్స్, ఫన్, సెంటిమెంట్ ఇలా ప్రతి ఎమోషన్ ఉన్న సినిమా ‘వేదాళం’. రీఎంట్రీ తర్వాత చిరుని ఇన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాలో నటించడం చూడలేదు. పర్ఫెక్ట్ ఫ్యాన్ స్టఫ్ ఉన్న సినిమాలో చిరు నటిస్తున్నాడు, అది కూడా రీమేక్‌ని సక్సెస్ ఫుల్‌గా తెరకెక్కించడంలో ప్రూవ్డ్ డైరెక్టర్ అయిన మెహర్ రమేష్ కాంబినేషన్‌లో. ఇవన్నీ ఆలోచించాడు కాబట్టే.. మెగాస్టార్.. మెహర్‌కి ఛాన్సిచ్చాడు. సెంటిమెంట్ ప్రకారం అందరి డౌట్స్‌ని క్లియర్ చేస్తూ ‘భోళా‌శంకర్’ సినిమా బ్లాక్‌బస్టర్ అయినా అవ్వవచ్చు. ఏమో చెప్పలేం.

Updated Date - 2022-07-22T02:10:53+05:30 IST