ట్విట్టర్ ట్రెండింగ్‌లో BoycottBrahmastra

ABN , First Publish Date - 2022-06-17T00:38:24+05:30 IST

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించారు.

ట్విట్టర్ ట్రెండింగ్‌లో BoycottBrahmastra

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్(Karan Johar) భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా  రూపొందించారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోను ఈ మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’  ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేశారు. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్‌ అబ్బుపరిచేలా ఉన్నాయి. సినిమా ట్రైలర్ విడుదల కాగానే ‘బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర’ (BoycottBrahmastra) ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. అందుకు కారణమేంటంటే... 


‘బ్రహ్మాస్త్ర’ ను బాయ్‌కాట్ చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ట్రైలర్‌లోని ఒక సీన్ ఓ వర్గం వారి మనోభావాలను గాయపరిచేలా ఉంది. రణ్‌బీర్ కపూర్ షూస్ వేసుకుని గుడి లోపలికీ ప్రవేశిస్తారు. ఈ సీన్‌తో సోషల్ మీడియా యూజర్స్‌కు కోపం వచ్చింది. ఫలితంగా వారు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సీన్‌ను  సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ‘‘అతడు షూస్ వేసుకుని ఎందుకు గుడి లోపలికి ప్రవేశిస్తున్నారు’’ అని ఆ నెటిజన్ ప్రశ్నించారు. ‘‘సనాతన ధర్మాన్ని పాటించేవారి మనోభావాలను గాయపరిచే అవకాశాన్ని బాలీవుడ్ ఎప్పుడు వదులుకోదు’’ అని మరో నెటిజన్ తెలిపారు.  ‘‘రణబీర్ కపూర్ షూస్ వేసుకుని గుడి గంటలను మోగిస్తున్నారు. దక్షణాది పరిశ్రమ హిందూ సంస్కృతిని గౌరవిస్తుంది. బాలీవుడ్ మాత్రం అలా చేయదు. హిందీ, సౌత్ సినిమాలకు తేడా ఇదే’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ తెలిపారు. ‘బ్రహ్మాస్త్ర’ లో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రలు పోషించారు. శివ పాత్రలో రణ్‌బీర్ కపూర్, ఇషా పాత్రలో ఆలియా భట్ కనిపించనున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 






Updated Date - 2022-06-17T00:38:24+05:30 IST