Boycott Bollywood: షారూఖ్, హృతిక్ రోషన్ సినిమాలే కొత్త టార్గెట్.. అసలు ఇన్ని సినిమాలను నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారంటే..

ABN , First Publish Date - 2022-08-14T23:50:18+05:30 IST

బాలీవుడ్‌లో గత కొంతకాలంగా బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తుంది. బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర, బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా ట్యాగ్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఇదిలా ఉండగానే షారూఖ్ ఖాన్, హృతిక్

Boycott Bollywood: షారూఖ్, హృతిక్ రోషన్ సినిమాలే కొత్త టార్గెట్.. అసలు ఇన్ని సినిమాలను నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారంటే..

బాలీవుడ్‌లో గత కొంతకాలంగా బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తుంది. బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర, బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇదిలా ఉండగానే షారూఖ్ ఖాన్, హృతిక్ రోషన్ నుంచి రాబోయే చిత్రాలను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్‌లు పెడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. 


బాయ్‌కాట్ ట్రెండ్‌కు మొదటి కారణంగా నెపోటిజం కనిపిస్తుంది. సెలబ్రిటీలపై నెటిజన్స్ అసంతృప్తితో ఉంటున్నారు. గతంలో వారు చేసిన వ్యాఖ్యలను గుర్తుంచుకుని సినిమా విడుదల సమయంలో బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ చేసిన వ్యాఖ్యల ఫలితంగానే తాజాగా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) ను బాయ్‌కాట్ చేయాలంటూ అనేక మంది పోస్ట్‌లు పెట్టారు. షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ప్రవర్తనతో అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ‘పఠాన్‌’ (Pathaan) ను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్స్ పిలుపునిస్తున్నారు. ‘లాల్ సింగ్ చడ్డా’ ను తాజాగా హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రశంసించాడు. అందువల్ల నెటిజన్స్ హృతిక్‌పై మండిపడుతున్నారు. ‘విక్రమ్ వేద’ ను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌తో కొంత మంది ప్రేక్షకులు అసంతృప్తికి లోనయ్యారు. ట్రైలర్‌లోని ఓ సీన్‌లో రణ్‌బీర్ కపూర్ షూస్ వేసుకుని గుళ్లోకీ ప్రవేశిస్తాడు. ఈ సన్నివేశంతో కొంత మంది నిరాశకు గురయ్యారు. ఫలితంగా బాయ్‌కాట్ బ్రహ్మాస్త్రకు పిలుపునిచ్చారు. ఈ వివాదంపై చిత్ర దర్శకుడైన అయాన్ ముఖర్జీ కూడా స్పందించాడు. బాయ్‌కాట్ సెగ సమీప కాలంలో ఆగేలా కనిపించడం లేదు. ఈ ట్రెండ్‌తో సమకాలీన అంశాలపై సెలబ్రిటీలు ఆచితూచి స్పందించక తప్పదు.  

Updated Date - 2022-08-14T23:50:18+05:30 IST