ఆ రాంగ్‌ నంబర్‌ ఎవరిది?

ABN , First Publish Date - 2022-05-26T06:33:35+05:30 IST

మారుతీరామ్‌, జియో దార్ల హీరోహీరోయిన్లుగా నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘రాంగ్‌ నంబర్‌’ ట్రైలర్‌ ఇటీవల విడుదల అయింది...

ఆ రాంగ్‌ నంబర్‌ ఎవరిది?

మారుతీరామ్‌, జియో దార్ల హీరోహీరోయిన్లుగా నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘రాంగ్‌ నంబర్‌’ ట్రైలర్‌ ఇటీవల విడుదల అయింది. పలువురు పంపిణీదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆర్‌.వి.ఎ్‌స.రావు మాట్లాడుతూ ‘చిన్న బడ్జెట్‌తో మొదలైన సినిమా ఇది. కథ నచ్చడంతో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తీయడంతో అనుకున్న దానికంటే బడ్జెట్‌ పెరిగింది. కరోనా వల్ల  ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి చిత్రాన్ని పూర్తి చేశాం.  సినిమా నచ్చి విడుదల చేయడానికి ముందుకు వచ్చిన పంపిణీదారులకు కృతజ్ఞతలు’ అన్నారు. చిత్ర దర్శకుడు సాంబశివరావు మాట్లాడుతూ ‘మా సినిమాలో అజయ్‌ ఘోష్‌ ప్రధాన విలన్‌గా నటించారు. అలనాటి ప్రముఖ నటుడు ఆర్‌. నాగేశ్వరరావు సోదరుడి మనవడు రాజనాల సతీష్‌ నాయుడును యంగ్‌ విలన్‌గా పరిచయం చేస్తున్నాం. సినిమా బాగా వచ్చింది’ అన్నారు. 

Updated Date - 2022-05-26T06:33:35+05:30 IST