‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీ్‌పరెడ్డి వంగా. ఆ కథని హిందీలోనూ తీసి సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్లో ‘యానిమల్’ తెరకెక్కిస్తున్నారు. సందీప్ రెడ్డి చెప్పిన ‘స్పిరిట్’కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన అప్ డేట్ రాబోతోందని టాక్. ప్రస్తుతం కథానాయిక, ఇతర నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో సందీప్ రెడ్డి బిజీగా ఉన్నట్టు టాక్. కథానాయికల రేసులో రష్మిక, కైరా అద్వాణీ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరు ప్రభా్‌సతో జట్టు కట్టడం ఖాయమని సమాచారం. సందీప్ రెడ్డి ‘కబీర్‌సింగ్’లో.. కైరా కథానాయిక. ‘యానిమల్’లో రష్మిక ఓ ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. వాళ్లిద్దరిలో ఒకరిని... సందీప్ రిపీట్ చేయబోతున్నారన్నమాట. ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.