మీకు బాగా నచ్చిన రచయిత ఎవరని అడిగితే... Sirivennela Seetharama Sastry రెస్పాన్స్ ఇదీ..!

ABN , First Publish Date - 2021-11-30T23:20:08+05:30 IST

‘సిరివెన్నెల’ సినిమాతో తెలుగు సినీ తెరకి కొత్త పౌర్ణమి తీసుకొచ్చిన సీతారామశాస్త్రి అస్తమించారు. ఆయన లేని మన సినీ సాహిత్యాన్ని ఇక మీదట ఊహించటం కూడా కష్టమే. అయితే కాలమనే ప్రవాహం అలా సాగిపోతూనే ఉంటుంది కదా... తెలుగు పాట ‘సిరివెన్నెల’ వారి స్మృతులు తలుచుకుంటూ ఇక మీద ముందుకు పోవాల్సిందే. మరి ఈ తరం గేయ రచయితల్లో సీతారామ శాస్త్రిని మెప్పించిన ప్రతిభావంతులు ఎవరు?

మీకు బాగా నచ్చిన రచయిత ఎవరని అడిగితే... Sirivennela Seetharama Sastry రెస్పాన్స్ ఇదీ..!

‘సిరివెన్నెల’ సినిమాతో తెలుగు సినీ తెరకి కొత్త పౌర్ణమి తీసుకొచ్చిన సీతారామశాస్త్రి అస్తమించారు. ఆయన లేని మన సినీ సాహిత్యాన్ని ఇక మీదట ఊహించటం కూడా కష్టమే. అయితే కాలమనే ప్రవాహం అలా సాగిపోతూనే ఉంటుంది కదా... తెలుగు పాట ‘సిరివెన్నెల’ వారి స్మృతులు తలుచుకుంటూ ఇక మీద ముందుకు పోవాల్సిందే. మరి ఈ తరం గేయ రచయితల్లో సీతారామ శాస్త్రిని మెప్పించిన ప్రతిభావంతులు ఎవరు? ఆయన కంటే ముందటి తరం వారిలో ఆయనను ప్రభావితం చేసిన మహానుభావులు ఎవరు? ‘ఓపెన్ హార్ట్’ కార్యక్రమంలో ‘సిరివెన్నెల’ స్పందన ఇది... 


‘‘ప్రతిరంగంలోనూ అందరిలోనూ అంతా గొప్పే ఉండదు. ఆయా విద్యలో ఉండే అద్భుతత్వాన్ని గ్రహిస్తానే తప్ప.. నాకు నటుల్లోగానీ, రచయితల్లోగానీ ‘ఒకళ్లు’ అంటూ నాకెవరూ లేరు. అయినా నా తత్వ దృష్టి కోణంలోంచి ఆలోచిస్తే నాకు ఒక్కళ్లే అంటే.. విశ్వనాథ సత్యనారాయణ తప్ప ఎవరూ లేరు. ప్రతిభాపరంగా చూస్తే.. దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి, సి.నారాయణరెడ్డి.. నా సమకాలీకుల్లో కూడా చాలా మందే ఉన్నారు. అలాగే.. చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్‌, భాస్కరభట్ల.’’

Updated Date - 2021-11-30T23:20:08+05:30 IST