విజిల్స్‌ వేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు

ABN , First Publish Date - 2022-06-27T10:07:40+05:30 IST

‘‘సమ్మతమే’ చూసిన ప్రేక్షకులు ‘మా కథే తీశారు. మా జీవితంలో కూడా ఇలా జరిగింది’ అని అభినందించడం ఆనందంగా ఉంది...

విజిల్స్‌ వేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు

‘‘సమ్మతమే’ చూసిన ప్రేక్షకులు ‘మా కథే తీశారు. మా జీవితంలో కూడా ఇలా జరిగింది’ అని అభినందించడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులంతా విజిల్స్‌ వేస్తూ, ఒక మాస్‌ సినిమాని చూస్తున్నట్లు ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అని కిరణ్‌ అబ్బవరం అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘సమ్మతమే’ ఇటీవలె విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. చిత్రబృందం ఆదివారం  సక్సెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘థియేటర్ల సంఖ్య పెరిగింది. రిపీట్‌ ఆడియన్స్‌ వస్తున్నారు. ఇంకా చూడని వాళ్లు థియేటర్‌కు వెళ్లి చూడండి’ అని కోరారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ‘బావుంది’ అంటున్నారనీ, మౌత్‌టాక్‌తోనే ‘సమ్మతమే’ బ్లాక్‌బస్టర్‌ అయిందనీ చిత్ర దర్శకుడు గోపీనాథ్‌రెడ్డి చెప్పారు. శాన్వీ పాత్ర ప్రేక్షకులకు నచ్చడం, సినిమా థియేట్రికల్‌ హిట్‌ కొట్టడం ఆనందంగా ఉందని చిత్ర కథానాయిక చాందిని చౌదరి అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చిత్ర నిర్మాత ప్రవీణ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-06-27T10:07:40+05:30 IST