Boxing నేపథ్యంలోని మొదటి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

ABN , First Publish Date - 2022-08-09T16:56:57+05:30 IST

క్రీడా నేపథ్యం కలిగిన చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఆసక్తికరమైన కథాకథనాలు, చక్కటి ఎమోషన్స్, మంచి డ్రామా ఉంటే.. అలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. టాలీవుడ్‌లో అప్పటి నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అలాంటి కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి.

Boxing నేపథ్యంలోని మొదటి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

క్రీడా నేపథ్యం కలిగిన చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఆసక్తికరమైన కథాకథనాలు, చక్కటి ఎమోషన్స్, మంచి డ్రామా ఉంటే..  అలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. టాలీవుడ్‌లో అప్పటి నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అలాంటి కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. కబడ్డీ, మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్  నేపథ్యంలో గతంలో వచ్చిన కొన్ని చిత్రాలు అభిమానుల్ని అలరించాయి. ముఖ్యంగా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘తమ్ముడు’ (Thammudu), రవితేజ (Raviteja) ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ (Amma Nanna O Thamil Ammay) లాంటి చిత్రాలు బలమైన కంటెంట్ ఉండడం వల్ల సూపర్ హిట్టయ్యాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా పూరీ జగన్నాథ్ (Puri Jagannath)  ‘లైగర్’ అనే మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది.  అసలు బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా ఏదో తెలుసా?  


తెలుగులో మొట్టమొదటి బాక్సర్‌గా రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) చరిత్రలో నిలిచిపోయారు. 1981లో విడుదలైన ‘పులిబిడ్డ’ (Pulibidda) చిత్రంలో ఆయన బాక్సర్ గా అదరగొట్టారు. బాక్సింగ్ నేపథ్యంలో తెలుగులో విడుదలైన మొట్టమొదటి చిత్రంగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. వి.మధుసూదనరావు (V.Madhusudana Rao) దర్శకత్వం వహించిన ఈ సినిమాను హేరంభ చిత్ర మందిర్ బ్యానర్ పై నాచు శేషగిరిరావు (Nachu Seshagirirao) నిర్మించారు. నిజానికి ఈ సినిమా కన్నడలో రాజ్ కుమార్ (Rajkumr) హీరోగా వచ్చిన ‘తాయిగే తక్కమగ’ (Tayige Thakka maga) (తల్లికి తగ్గ తనయుడు) చిత్రానికిది రీమేక్ వెర్షన్. కన్నడతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో కాశీవిశ్వనాథ.. అనే పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. 


ఇందులో హీరో తండ్రి ఒక బాక్సింగ్ ఛాంపియన్. ప్రత్యర్ధులు చేసిన కుట్రకు బలైపోతాడు. అతడి కొడుకైన కృష్ణంరాజు వేరే తల్లి సంరక్షణలో పెరుగుతారు. అలాగే ఆయనకి బాక్సింగ్ మీద మంచి పట్టు్ంటుంది. అయితే తన బిడ్డ ఎవరో తెలుసుకున్న అసలు తల్లి తన కొడుకును వెతుక్కుంటూ వస్తుంది. చివరికి ఆ కొడుకు తల్లి దగ్గరకు ఎలా చేరాడు అన్నది మిగతా కథ. ఈ సినిమా తల్లీకొడుకుల సెంటిమెంట్, బాక్సింగ్ నేపథ్యంలోని సన్నివేశాల వల్ల సూపర్ హిట్టయింది. అయితే త్వరలో రాబోతున్న లైగర్ చిత్రానికీ దీనికీ ఒక పోలిక ఏంటంటే.. ‘లైగర్’ అనే పదానికి ఎలాంటి అర్ధం ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం దాని అర్ధం ‘పులిబిడ్డ’. కథాంశం కూడా అలాంటిదో కాదో తెలియాలంటే.. ‘లైగర్’ విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే. 

Updated Date - 2022-08-09T16:56:57+05:30 IST