ఓవర్సీస్‌లో ఆ రికార్డును బ్రేక్ చేసే సినిమాలేవి..?

ABN , First Publish Date - 2022-02-18T23:31:58+05:30 IST

భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు

ఓవర్సీస్‌లో ఆ రికార్డును బ్రేక్ చేసే సినిమాలేవి..?

భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే చిత్రాలన్నింటిని ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్లు నిర్మాతలకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. దీంతో హిందీ, తెలుగు, తమిళ్ మూవీస్‌ను విదేశాల్లో కూడా విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్స్‌లో విడుదల అవుతున్నప్పటికి ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకొలేకపోతున్నాయి. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ అనంతరం ఏ సినిమా కూడా ఆ స్థాయిలో వసూళ్లను సాధించలేదు. ‘పుష్ప: ది రైజ్’ చిత్రం బాలీవుడ్‌లో భారీ వసూళ్లను సాధించినప్పటికీ ఓవర్సీస్ మార్కెట్‌లో ఆ స్థాయిలో విజయం సాధించలేదు.   


అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటివారంలో ఓవర్సీస్‌లో దాదాపుగా 1.05మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ మాత్రం 10.3 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. సినిమాలపై వినోద రంగం 2019లో రూ.19,100కోట్లను వెచ్చించింది. ఓవర్సీస్ నుంచి ఈ చిత్రాలన్ని దాదాపుగా రూ.2,700కోట్ల వసూళ్లను సాధించాయి. ‘‘..‘పుష్ప’ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. కానీ, ‘బాహుబలి’ స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది’’ అని ఓ ట్రేడ్ ఎక్స్‌ఫర్ట్ చెప్పారు. తమిళ సినిమాలు ఓవర్సీస్‌లో సాధించే వసూళ్లల్లో మలేషియా నుంచే 60శాతం వస్తాయి. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ చిత్రాలు విడుదల కావడం లేదు. 


‘‘గతంలో బాలీవుడ్ సినిమాలు ఓవర్సీస్‌‌ని దుమ్ము దులిపేవి. 1990లో షారూఖ్ చిత్రాలు థియేటర్లల్లో అద్భుతంగా నడిచేవి. కానీ, కొన్నేళ్లుగా విడుదలవుతున్న మూవీస్‌ని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. యువతరం థియేటర్లకు రావడం లేదు. దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లను రాబడుతున్నాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన మూవీస్ మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. హాలీవుడ్‌తో పోలీస్తే భారతీయ సినిమాల టిక్కెట్ల ధరలు విదేశాల్లో అధికంగా ఉంటున్నాయి. అక్కడ మార్కెట్ సైజు చిన్నదిగా ఉంటుంది. రిలీజ్ ఖర్చులను రాబట్టుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉంచుతున్నారు’’ అని సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి తెలిపారు. ‘గంగూబాయి కతియవాడి’, ‘వలీమై’, ‘బచ్చన్ పాండే’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలన్ని వచ్చే కొన్ని వారాల్లో విడుదల కానున్నాయి. ఈ చిత్రాలు ఎటువంటి రికార్డులను తిరగరాస్తాయో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

Updated Date - 2022-02-18T23:31:58+05:30 IST