ఎక్కడి దొంగలు అక్కడే గప్‌ చుప్‌

ABN , First Publish Date - 2022-07-05T05:50:54+05:30 IST

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. నిజాయితీకి మారు పేరు అనేది ఉపశీర్షిక. ప్రదీప్‌ వర్మ దర్శకుడు....

ఎక్కడి దొంగలు అక్కడే గప్‌ చుప్‌

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. నిజాయితీకి మారు పేరు అనేది ఉపశీర్షిక. ప్రదీప్‌ వర్మ దర్శకుడు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాత. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ‘అల్లూరి’ టీజర్‌ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్‌ చుప్‌..’ అనే డైలాగ్‌తో ఈ టీజర్‌ మొదలైంది. శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘ప్రదీ్‌పతో నాది నాలుగేళ్ల ప్రయాణం. అల్లూరిలో ఉండే ఆవేశాన్ని ఆయనలో చూశా. సైనికులు, పోలీసులు, వైద్యులంటే నాకు చాలా గౌరవం. అలాంటి పాత్రలు వస్తే, అందులో నిజాయతీ ఉండి, మనసుకు నచ్చితేనే చేయాలని అనుకొనేవాడిని. సరిగ్గా అలాంటి పోలీస్‌ పాత్ర దక్కింది. ఇదో ఫిక్షనల్‌ బయోపిక్‌. ఓ వాస్తవ ఘటనని ఎంచుకొని ఓ కథగా చేశామ’’న్నారు. ‘‘ఈ సినిమా చూశాక పోలీసులపై ఓ మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు పోలీసులకు సెల్యూట్‌ చేస్తార’’న్నారు దర్శకుడు. ‘‘అన్ని కమర్షియల్‌ హంగులూ ఉన్న సినిమా ఇది. ఓ గొప్ప కథని చెప్పామన్న సంతృప్తి దక్కింద’’న్నారు నిర్మాత. కయ్యదు లోహర్‌, తనికెళ్ల భరణి, సుమన్‌, పమ్రోదిని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌. 

Updated Date - 2022-07-05T05:50:54+05:30 IST