అన్‌స్క్రీన్‌ ఆర్‌జేలు... అలరించేస్తున్నారు!

ABN , First Publish Date - 2022-03-04T01:08:54+05:30 IST

మిగతా ఎవ్వరికీ లేని ఛాన్స్ యాక్టర్స్‌కి ఉంటుంది. అదేంటంటే, రియల్ లైఫ్‌లో కాకున్నా రీల్ లైఫ్‌లో రకరకాల వృత్తుల్ని చేపట్టవచ్చు. ఓ సినిమాలో డాక్టర్‌గా స్టెతస్కోప్ మెడలో వేసుకోవచ్చు. మరోదాంట్లో ఇంజనీర్ అవ్వొచ్చు. ఇంకోదాంట్లో విమానం నడిపే పైలట్ కూడా అవ్వొచ్చు.

అన్‌స్క్రీన్‌ ఆర్‌జేలు... అలరించేస్తున్నారు!

మిగతా ఎవ్వరికీ లేని ఛాన్స్ యాక్టర్స్‌కి ఉంటుంది. అదేంటంటే, రియల్ లైఫ్‌లో కాకున్నా రీల్ లైఫ్‌లో రకరకాల వృత్తుల్ని చేపట్టవచ్చు. ఓ సినిమాలో డాక్టర్‌గా స్టెతస్కోప్ మెడలో వేసుకోవచ్చు. మరోదాంట్లో ఇంజనీర్ అవ్వొచ్చు. ఇంకోదాంట్లో విమానం నడిపే పైలట్ కూడా అవ్వొచ్చు. ఇక ఆర్మీ జవానుగా, పోలీసుగా మన హీరోలు ఎప్పుడో ఓ సారి కనిపిస్తూనే ఉంటారు. హీరోయిన్స్ అయితే తమ నటించ గలిగే సత్తా నిరూపించుకోవాలనుకుంటే పదికి తొమ్మిది సార్లు వేశ్య పాత్రకి జైకొట్టేస్తుంటారు!


మారుతోన్న కాలంతో పాటూ సినిమా కూడా మారుతోంది. ఇప్పుడు మన నటీనటుల తాజా రీల్ లైఫ్ ఫేవరెట్ ప్రొఫెషన్... ‘ఆర్‌జే’... అంటే, రేడియో జాకీ అన్నమాట. బాలీవుడ్‌లో విద్యాబాలన్ మొదలు టాలీవుడ్‌లో ‘శంకర్‌దాదా జిందాబాద్’ హీరోయిన్ కరిష్మా కొటాక్ వరకూ చాలా మంది ఆన్‌స్క్రీన్ ఆర్జేలుగా అలరించారు. అయితే, బాలీవుడ్, టాలీవుడ్ లాగే కోలీవుడ్‌లోనూ రేడియో జాకీ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. ఈ మధ్యే పలువురు నటులు మైక్ ముందుకొచ్చి శ్రోతల్ని విజయవంతంగా అలరించారు. 


సౌత్‌లో లెటెస్ట్‌గా ఆర్జే అవతారం ఎత్తిన టాలెంటెడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్. ‘హే సినామిక’ సినిమాలో మైక్ ముందు కూర్చుని, తలకి హెడ్‌సెట్ పెట్టుకుని రొమాంటిక్ పాత్రలో గొంతు సంవరించుకున్నాడు. గతంలో జ్యోతిక కూడా అర్జేగా అందరి చేతా ఆహా అనిపించుకుంది. ‘కాట్రిన్ మొళి’ సినిమాలో ఆమె రేడియో జాకీగా లేట్ నైట్ టాక్ షో నిర్వహిస్తుంది. ఇక తమిళ హీరో అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతన్ అయితే డెబ్యూ మూవీలోనే ఆర్జే క్యారెక్టర్ ప్లే చేశాడు. ‘ఎన్న సొల్ల పోగిరై’లో ఆయన జాబ్ రేడియో స్టేషన్‌లోనే... 


కోలీవుడ్‌లో ఇప్పటి వరకూ సక్సెస్‌ఫుల్ ఆన్‌స్క్రీన్ ఆర్జేలుగా అలరించిన హీరోయిన్స్ విషయానికి వస్తే... అదితి రావ్ హైదరీ, అనుయ గురించి చెప్పుకోవాలి. ‘సైకో’ సినిమాలో అదితి రావ్ తన మాటలతోనే అంధుడైన హీరోని మాయ చేస్తుంది! ఉదయనిధి స్టాలిన్ ఆమెని చూడకుండా కేవలం వింటూ వింటూనే ప్రేమలో పడిపోతాడు! ‘శివ మనసుల శిక్తి’ సినిమాలో హీరోయిన్ అనుయ కూడా ఆర్జేనే. కానీ, హీరోకి తాను ఎయిర్ హోస్టెస్ అని చెబుతోంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమాలోని కథ... 

Updated Date - 2022-03-04T01:08:54+05:30 IST