Debut Hero ‘ముద్దు’ ముచ్చట... లిప్‌లాక్‌కి ముందు వణికిపోయాడట!

ABN , First Publish Date - 2021-11-22T21:41:38+05:30 IST

తొలి చిత్రంలో ఈ డెబ్యూ హీరోకి కొత్త భామతో జోడీ కుదరలేదు. తారా సుతారియా లాంటి కాస్త సీనియర్ సుందరితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే కొన్ని రొమాంటిక్ సినిమాలు చేసి మంచి ఫామ్‌లో ఉన్న తారా అంటే... యూత్‌ ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్. ఆమెతో ఆన్‌స్క్రీన్ లిప్‌లాక్ చేయాల్సి వచ్చిందట...

Debut Hero ‘ముద్దు’ ముచ్చట... లిప్‌లాక్‌కి ముందు వణికిపోయాడట!

బాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి ‘తడప్’ సినిమాతో వచ్చేస్తున్నాడు. అయితే, తొలి చిత్రంలో ఈ డెబ్యూ హీరోకి కొత్త భామతో జోడీ కుదరలేదు. తారా సుతారియా లాంటి కాస్త సీనియర్ సుందరితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే కొన్ని రొమాంటిక్ సినిమాలు చేసి మంచి ఫామ్‌లో ఉన్న తారా అంటే... యూత్‌ ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్. ఆమెతో ఆన్‌స్క్రీన్ లిప్‌లాక్ చేయాల్సి వచ్చిందట అహాన్‌కి! 


ఈ మధ్య బాలీవుడ్‌ మూవీస్‌లో హాట్ కిస్సింగ్ సీన్స్ సర్వ సాధారణం అయిపోయాయి. తారా సుతారియాకు అంతో ఇంతో అనుభవం కూడా ఉంది. కానీ, తొలి చిత్రంలో నటిస్తోన్న అహాన్ శెట్టి మాత్రం వణికిపోయాడట. కెమెరా ముందు, క్రూ మెంబర్స్ అందరూ చూస్తుండగా యంగ్ బ్యూటీని కిస్ చేయాలంటే చేతుల్లో షివరింగ్ వచ్చిందట. డైరెక్టర్ మిలన్ లూథ్రియా ‘డర్టీ పిక్చర్‌’లోని ఓ సీన్ చూపించి అలా చేయమని సజెషన్ ఇచ్చి ఊరుకున్నాడట. ఆ తరువాత నానా తంటాలు పడిన అహాన్ శెట్టి, ఎలాగో, ఆ చుంబనాన్ని గుంభనంగా కానిచ్చేశానని చెప్పాడు. అయితే, ముద్దు సీన్ తరువాత తారా సుతారియాతో తాను బాగా క్లోజ్ అయ్యానని సిన్సియర్‌గానే ఒప్పుకుంటున్నాడు బీ-టౌన్ న్యూ కిడ్! అందుకే, సినిమాలోని ఎమోషనల్ సీన్స్ తాము చక్కగా చేయగలిగామని వివరించాడు! 

Updated Date - 2021-11-22T21:41:38+05:30 IST