షూటింగ్ షిప్ట్ చేస్తే అమితాబ్‌తో టైమ్ స్పెండ్ చేస్తానన్న Rekha.. షాకిచ్చిన డైరెక్టర్

ABN , First Publish Date - 2021-12-16T15:48:28+05:30 IST

గతంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నటి రేఖ మధ్య రిలేషన్ ‌షిప్ ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే...

షూటింగ్ షిప్ట్ చేస్తే అమితాబ్‌తో టైమ్ స్పెండ్ చేస్తానన్న Rekha.. షాకిచ్చిన డైరెక్టర్

గతంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నటి రేఖ మధ్య రిలేషన్ ‌షిప్ ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రచారాల వల్ల ఇద్దరు సూపర్‌స్టార్‌లు మాత్రం ఎప్పుడూ ప్రభావితం కాలేదు. అయితే ప్రముఖ నటుడు రంజీత్ వారి రిలేషన్ షిప్ గురించి మాట్లాడాడు. ఆమె చేసిన చిన్న అభ్యర్థన కారణంగా తాను దర్శకత్వం వహించిన చిత్రం నుంచి తీసివేయాల్సి వచ్చిందని తెలిపాడు.


రంజీత్ ఎక్కువగా నెగటివ్ రోల్స్‌తో బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సంపాదించాడు. ఓ సందర్భంలో ఆయన 1990లో ‘కర్ణమ’ అనే సినిమాకి డైరెక్షన్ చేశాడు.  అందులో ధర్మేంద్ర హీరో కాగా.. రేఖ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అయితే ఓ సందర్భంలో ఆ సీనియర్ నటి రంజీత్ ఫోన్ చేసి ‘నా వర్కింగ్ సమయాన్ని ఉదయానికి మారిస్తే సాయంత్రాన్ని అమితాబ్ బచ్చన్‌తో కలిసి గడుపుతాన‌’ని అడిగిందని చెప్పాడు.


అయితే షెడ్యూల్ సమస్యల వల్ల ధర్మేంద్ర సలహా మేరకు ఆమెని సినిమా నుంచి తొలగించినట్లు రంజీత్ తెలిపాడు. అయితే దీని గురించి అమితాబ్ ఏమి మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ధర్మేంద్ర కూడా ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో వినోద్ ఖన్నా, ఫరా రాజ్‌తో తెరకెక్కించినట్లు పేర్కొన్నాడు.

Updated Date - 2021-12-16T15:48:28+05:30 IST