Brahmastra: పొరపాటున సినిమా ఫ్లాప్ అయితే

ABN , First Publish Date - 2022-09-08T23:00:08+05:30 IST

Brahmastra: పొరపాటున సినిమా ఫ్లాప్ అయితే

Brahmastra: పొరపాటున సినిమా ఫ్లాప్ అయితే

బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). క్రేజీ కపుల్  ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించారు. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్‌‌స్టార్ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. బీ టౌన్ హిస్టరీలోనే అత్యధికంగా రూ.410కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మితమైంది. పొరపాటున ఈ చిత్రం ప్లాప్ అయితే దాని పర్యవసానలు ఎలా ఉంటాయంటే..


‘బ్రహ్మాస్త్ర’ పైనే బాలీవుడ్ ఆశలు.. 

బాలీవుడ్ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం లేదు. వసూళ్లను రాబట్టడం లేదు. స్టార్ హీరోల చిత్రాలు అందుకు మినహాయింపేం కాదు. దీంతో బాలీవుడ్ మొత్తం ఈ మూవీపైనే ఆశలు పెట్టుకుంది. బీ టౌన్ తిరిగి కోలుకుంటుందని అందరు ఆశిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కానీ, ఒకవేళ ‘బ్రహ్మాస్త్ర’ ప్లాప్ అయితే బాలీవుడ్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవు. బీ టౌన్ తిరిగి పునరుజ్జీవనం పొందడానికి మరో చిత్రం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. భారీ బడ్జెట్ మూవీస్ వైపు మరల ఎవరు కన్నెత్తి కుడా చూడరు. 


అభిప్రాయాలకు అడ్డంకులు..

రణ్‌బీర్ కపూర్ గతంలో చేసిన వ్యాఖ్యలు సినిమా బాయ్‌కాట్‌కు కారణమయ్యాయి. రణ్‌బీర్ 11ఏళ్ల క్రితం తాను బిగ్ బీఫ్ బాయ్ అని చెప్పుకున్నాడు. ఆలియా భట్‌పై నెపోకిడ్ అనే ముద్ర ఇప్పటికే ఉంది. తనను వెండితెర మీద చూడటం ఇష్టం లేకపోతే సినిమాను చూడొద్దని కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆలియా, రణ్‌బీర్, అయాన్ ముఖర్జీ తాజాగా ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నించారు. కానీ, కొంత మంది నిరసనలు తెలపడంతో దర్శనం చేసుకోకుండానే వెళ్లియారు. నిరసనలకు గతంలో రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలే కారణం. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడాలంటే, అభిప్రాయాలు చెప్పాలంటే కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. 


సినిమాకు భారీ బడ్జెట్‌..

పురణాల్లోని అస్త్రాలను ఆధారంగా చేసుకుని ‘బ్రహ్మాస్త్ర’ ను రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్‌ఎక్స్) కోసం రూ. 150కోట్లను వెచ్చించారు. వీఎఫ్ఎక్స్‌ను లండన్‌లోని డబుల్ నెగెటివ్ స్టూడియో చేసింది. ఈ స్టూడియో గతంలో అనేక ఆస్కార్ విన్నింగ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్‌ను అందించింది. ఒక వేళ ‘బ్రహ్మాస్త్ర’ కనుక ప్లాప్ అయితే భారీ బడ్జెట్‌తో సినిమాలు రూపొందించడానికి బాలీవుడ్ ఆలోచన కూడా చేయదనడంలో అతిశయోక్తి లేదు.   




Updated Date - 2022-09-08T23:00:08+05:30 IST