ఆయనతో నన్ను అస్సలు పోల్చకండి.. నేను పూర్తిగా భిన్నం.. సరిగ్గా నాలుగేళ్ల క్రితం Puneeth Rajkumar వ్యాఖ్యలివి

ABN , First Publish Date - 2021-10-31T02:20:22+05:30 IST

పునీత్ రాజ్‌కుమార్ మృతి ఆయన అభిమానుల్నే కాదు... వారి కుటుంబం మొత్తానికీ అభిమానులుగా ఉన్న కోట్లాది మందిని కలచి వేస్తోంది. లెజెండ్రీ కన్నడ స్టార్ ‘కంఠీరవ’ రాజ్‌కుమార్ అంటే కర్ణాటకలో ఎంతో మందికి ఇప్పటికీ చెప్పలేని అభిమానం. ఇక ఆయన వారసులు...

ఆయనతో నన్ను అస్సలు పోల్చకండి.. నేను పూర్తిగా భిన్నం.. సరిగ్గా నాలుగేళ్ల క్రితం Puneeth Rajkumar వ్యాఖ్యలివి

పునీత్ రాజ్‌కుమార్ మృతి ఆయన అభిమానుల్నే కాదు... వారి కుటుంబం మొత్తానికీ అభిమానులుగా ఉన్న కోట్లాది మందిని కలచి వేస్తోంది. లెజెండ్రీ కన్నడ స్టార్ ‘కంఠీరవ’ రాజ్‌కుమార్ అంటే కర్ణాటకలో ఎంతో మందికి ఇప్పటికీ చెప్పలేని అభిమానం. ఇక ఆయన వారసులు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వారే. పునీత్ రాజ్‌కుమార్ ‘వపర్ స్టార్’గా మరింత కమర్షియల్ సక్సెస్ అండ్ ఇమేజ్ పొందారు. అయితే, ఆయన నాలుగేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి, దివంగత మహానటుడు రాజ్‌కుమార్ గురించి స్పందించారు...


‘‘ఎప్పుడైనా, ఎవరైనా వచ్చి... ఫలానా సీన్‌లో నేను అచ్చం మా నాన్నలాగే కనిపించానని చెప్పినా లేదా ఆయన హావభావాలు నాలో కనిపించాయని అన్నా... నేను అలా పోల్చవద్దని చెబుతాను. ఎందుకంటే, నేను ఆయనలా కాదు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను ఎంతో గారాబంగా పెంచింది. దాని వల్ల నేను మా నాన్న స్థాయిలో క్రమశిక్షణ కలిగిన వాడ్ని కాలేకపోయాను. నేను పుట్టిపెరిగింది విభిన్నమైన సమయంలో. ఎక్కడికి వెళ్లినా నేను అత్యున్నతమైన చోట్లలోనే నివసించాను. మా నాన్న అలా కాదు. ఆయన ఎంతో సాదాసీదాగా జీవించేవారు’’ అంటూ తన తండ్రికి, తనకి మధ్య వ్యత్యాసాన్ని వివరించారు పునీత్ రాజ్‌కుమార్. 


రాజ్‌కుమార్ మాదిరిగా మరెవ్వరూ ఉండరనీ, ఉండలేరనీ పునీత్ గొప్పగా చెప్పేవారు... ‘‘మేము ఆయన వారసులం. కాబట్టి ఆయనలా కనిపించటం సహజమే. శివ రాజ్‌కుమార్‌లోనూ, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లోనూ, నాలోనూ... జనం మా నాన్నని చూసుకుంటారు. కానీ, ‘నేను మా నాన్నలా ఉంటాను’ అని నేనే స్వయంగా అంటే... అది అబద్ధమే! ఎందుకంటే, రాజ్‌కుమార్ ప్రత్యేకం. ఆయనలా మరెవ్వరూ ఉండలేరు. ఇంకెవర్నీ ఆయనతో పోల్చలేమని నా అభిప్రాయం’’. 

Updated Date - 2021-10-31T02:20:22+05:30 IST