ఏం చూసి Puneeth Rajkumar ను మీరు ఇష్టపడ్డారు..? అని భార్య Ashwini ని అడిగితే.. గతంలో ఆమె చెప్పిన సమాధానమిదీ..!

ABN , First Publish Date - 2021-10-30T01:01:09+05:30 IST

సినిమా హీరోలకి తెరపైన అనేక లవ్ స్టోరీలుంటాయి. కానీ, నిజ జీవితంలో అందరూ ప్రేమించి పెళ్లి చేసుకోరు. అయితే, కన్నడ పవర్ స్టార్ రియల్ లైఫ్‌లోనూ ప్రేమ వివాహమే చేసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఓ పార్టీలో అశ్వినీని కలుసుకున్నారు...

ఏం చూసి Puneeth Rajkumar ను మీరు ఇష్టపడ్డారు..? అని భార్య Ashwini ని అడిగితే.. గతంలో ఆమె చెప్పిన సమాధానమిదీ..!

సినిమా హీరోలకి తెరపైన అనేక లవ్ స్టోరీలుంటాయి. కానీ, నిజ జీవితంలో అందరూ ప్రేమించి పెళ్లి చేసుకోరు. అయితే, కన్నడ పవర్ స్టార్ రియల్ లైఫ్‌లోనూ ప్రేమ వివాహమే చేసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఓ పార్టీలో అశ్వినీని కలుసుకున్నారు. వాళ్లిద్దరి పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా, ప్రేమ పెళ్లిగా మారటానికి పెద్దగా టైం పట్టలేదు. చిక్‌మగళూరుకు చెందిన అశ్వినీతో పునీత్ వివాహం డిసెంబర్ 1, 1999లో జరిగింది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన వారి వైవాహిక జీవితానికి తీపి గుర్తులు వారి ఇద్దరు కూతుర్లే... 


పునీత్ శ్రీమతి అశ్వినీని, ఓ ఇంటర్వ్యూలో, ‘‘మీకు మీ భర్తలో ఏం నచ్చి ఆయన్ని పెళ్లాడారు?’’ అని అడిగితే... ఆసక్తికరంగా స్పందించారు. ‘‘ఆయన సింప్లిసిటీ, హెల్ప్‌ఫుల్ నేచర్ నాకు ఎంతగానో నచ్చాయి. ఆయన అందర్నీ వెనువెంటనే నమ్మేస్తారు. ఆయనకి ప్రయాణాలన్నా, మంచి మిత్రులన్నా ఎంతో ఇష్టం. అవన్నీ నన్ను ఆయనకి దగ్గర చేశాయి... ’’ అని అశ్వినీ వివరించారు...  

Updated Date - 2021-10-30T01:01:09+05:30 IST