పద్మశ్రీ అవార్డు రాక‌పోవడానికి కారణమేంటని అడగగా.. Sonu Sood ఇచ్చిన సమాధానమిది..?

ABN , First Publish Date - 2021-11-14T22:13:24+05:30 IST

పద్మ అవార్డులు దేశంలో సంచలనం సృష్టించాయి. భారత్‌కు స్వాతంత్ర్యం 2014లో‌నే వచ్చిందని కంగన వివాదస్పద కామెంట్స్ చేయడంతో వాటిపై మరింత దుమారం రేగింది.

పద్మశ్రీ అవార్డు రాక‌పోవడానికి కారణమేంటని అడగగా.. Sonu Sood ఇచ్చిన సమాధానమిది..?

పద్మ అవార్డులు దేశంలో సంచలనం సృష్టించాయి. భారత్‌కు స్వాతంత్ర్యం 2014లో‌నే వచ్చిందని కంగన వివాదస్పద కామెంట్స్ చేయడంతో వాటిపై మరింత  దుమారం రేగింది. దీంతో ఆమెకిచ్చిన పద్మ శ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. సోనూ సూద్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వక పోవడంతో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కంగన పేరు పరిశీలనలో లేకపోయినా బీజేపీ ప్రభుత్వం ఆమెకు పద్మ శ్రీ అవార్డు ఇచ్చింది. ఆ ప్రభుత్వం మీకు అవార్డును ఎందుకు ఇవ్వలేదు’’ అనగా ఆయన స్పందించాడు.


‘‘ నాకు అవార్డులు వచ్చినా రాకపోయినా సామాజిక సేవా కార్యక్రమాలను నేను కొనసాగిస్తాను. ఇప్పటికే 22వేల మంది విద్యార్థులకు నేను సహాయం చేశాను ’’ అని సోనూ సూద్ తెలిపారు. సమకాలీన రాజకీయాలపై కూడా ఆయన స్పందించారు. ‘‘ పని చేసే స్వాతంత్ర్యం ఎక్కడున్నా సరే ఆ ప్లాట్‌ఫామ్‌లో చేరతాను. ఆ ప్లాట్ ఫామ్ అనేది రాజకీయ, రాజకీయేతర పార్టీ కావచ్చు. పిల్లల చదువుల కోసం దాదాపుగా 22 వేల మందికి నేను సహాయం చేశాను. అన్నదాతలకు ఎప్పుడు కూడా నేను అనుకూలంగానే ఉంటాను. మనం అన్నం తింటున్నామంటే దానికి కారణం వారే ’’ అని ఆయన వివరించారు. 


ప్రస్తుత కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తన సోదరి మాళవిక త్వరలో రాజకీయాల్లోకి వస్తుందని చెప్పారు. ఆమెకు అందరూ మద్దతు తెలపాలని సోనూ సూద్ కోరారు. అప్, కాంగ్రెస్ రెండు కూడా మంచి పార్టీలే అని వెల్లడించారు. 

Updated Date - 2021-11-14T22:13:24+05:30 IST