Nagababu: చిరు గురించి ఏం చెప్పబోతున్నారు?

ABN , First Publish Date - 2022-08-21T03:20:00+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు (ఆగస్ట్ 22)ను పురస్కరించుకుని.. సెలబ్రేషన్స్‌ను భారీగా నిర్వహించబోతున్నట్లుగా మెగాబ్రదర్ నాగబాబు (Nagababu) మీడియా సమావేశం నిర్వహించి మరీ

Nagababu: చిరు గురించి ఏం చెప్పబోతున్నారు?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు (ఆగస్ట్ 22)ను పురస్కరించుకుని.. సెలబ్రేషన్స్‌ను భారీగా నిర్వహించబోతున్నట్లుగా మెగాబ్రదర్ నాగబాబు (Nagababu) మీడియా సమావేశం నిర్వహించి మరీ ప్రకటించారు. ఈసారి సెలబ్రేషన్స్ మాములుగా ఉండవని చెబుతూనే.. అన్నయ్య చిరంజీవి గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని ఈ వేడుకలో తను ప్రకటించనున్నట్లుగా తెలిపారు. ఆగస్ట్ 21న ‘మెగా కార్నివాల్’ (mega carnival) పేరుతో చిరంజీవి బర్త్‌డే వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేసినట్లుగా నాగబాబు ప్రకటించినా.. ఆ వేడుకల కంటే కూడా.. ఆయన చెబుతానన్న విషయం ఏమై ఉంటుందా? అని మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చలు జరుపుతున్నారు. (Chiranjeevi Birthday)


ఎందుకంటే.. చిరంజీవి గురించి మ్యాగ్జిమమ్ అంతా తెరిచిన పుస్తకమే. ఆయన హీరోగా చేసిన చిత్రాలు, అందులో నటించిన పాత్రలు మెగాభిమానులు ఎప్పుడూ ఫాలో అవుతూనే ఉంటారు. అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమాలు, గుప్తదానాలు బయటికి చెప్పకపోయినా.. ఏదో ఒక సమయంలో సహాయం పొందిన వారు బయటపెడుతూనే ఉంటారు. మరి ఇంకా చిరు గురించి నాగబాబు ఏం చెప్పబోతున్నారు? ఆయన హాస్పిటల్ పెట్టే విషయం గురించి చెబుదామని అనుకున్నారా? ఆ విషయం చిరు ఎప్పుడో చెప్పారు? దానికి నాంది ఈ పుట్టినరోజే అంటూ తాజాగా జరిగిన ‘సిసిసి జెర్సీ అండ్ ట్రోఫీ’ లాంచ్ వేడుకలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంకా చిరు బయోపిక్ గురించి ఏమైనా ప్రస్తావిస్తారా? అదయితే.. చిరంజీవే తన బయోపిక్‌ని తనే స్వయంగా రాసుకుంటున్నట్లుగా కూడా లాక్‌డౌన్ సమయంలో వెల్లడించారు. మరి ఇవేవీ కాకుంటే.. చిరు గురించి నాగబాబు ఏ విషయం రివీల్ చేయబోతున్నారు.. ఇప్పుడిదే మెగాభిమానులలో ఆసక్తికరమైన చర్చలకు తావిస్తోంది. మరి నాగబాబు చెప్పే ఆ ఎక్స్‌క్లూజివ్ విజయం తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.

Updated Date - 2022-08-21T03:20:00+05:30 IST